టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్లాస్ డైరెక్టర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సొంత నిర్మాణ సంస్థ అమిగోస్ బ్యానర్ లో మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

అప్పటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలను మాత్రమే తీసే దర్శకుడిగా ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. కమర్షియల్ సినిమా అంటూ వల్గారిటీ చూపించే వారికి ఒకరకంగా ఆనంద్ సినిమాతో దర్శకుడు శేఖర్ కమ్ముల చెక్ పెట్టినట్టైంది. యాక్షన్, రొమాంటిక్ సినిమాలంటూ రక్తపాతం, ఆశ్లీలం చూపిస్తున్న సమయంలో నిజంగానే మంచి కాఫీ లాంటి సినిమాను అందించారు.

ఇక ‘గోదావరి’ సినిమాతో స్వచ్చమైన మరో తెలుగు సినిమాను ప్రేక్షకులను అందించారు శేఖర్ కమ్ముల. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే కథ కథనాలతో తెరకెక్కించిన ‘గోదావరి’ సినిమా ఆయన కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలిచింది. అంతేకాదు హీరోయిన్ కమిలినీ ముఖర్జీకి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ శేఖర్ కమ్ముల సినిమా కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. అందుకు కారణం ఆయన మంచి ఫ్యామిలీ సినిమాలను తీస్తూ విజయాలను అందుకుంటుండమే.

ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. అంతేకాదు రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఇక ఇదే క్రమంలో కంప్లీట్ యూత్ సినిమాగా హ్యాపీ డేస్ తీసి భారీ విజయాన్నీ అందుకున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉన్నంత సేపు ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు గానీ, రిలీజైయ్యాక మాత్రం పెద్ద సంచలనమే సృష్ఠించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతీ స్టూడెంట్ ఈ సినిమాను తమకి తాము ఆపాదించుకున్నారు. ఒక్కొక్కరు తమ, తమ చుట్టుపక్కల ఉండే పాత్రలను హ్యాపీ డేస్ సినిమాలో చూసుకున్నారు. అంతగా శేఖర్ కమ్ముల ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన రానా డెబ్యూ మూవీ లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక లాంటి సినిమాలు ఆయన మార్క్ సినిమాలు కాదని పేరు తెచ్చుకున్నాయి. లీడర్ సినిమా కథ కథనాలు బావున్నప్పటికి ఎందుకో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. శేఖర్ కమ్ముల తీసిన పెద్ద హీరో అంటే వరుణ్ తేజ్ మాత్రమే.

ఆయనకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేయాలని ఉంటుంది. కానీ కథ నరేట్ చేయడంలో ఆయన చాలా పూర్ అని స్వయంగా వెల్లడించాడు. నేను కథ చెప్తానంటే పెద్ద హీరోలెవరూ సమయం ఇవ్వరు. ఎందుకంటే నేను కథ చెప్తే వాళ్ళకి నీరసం వస్తుంది. అని చెప్పుకొచ్చారు. ఇక నేను తీసే సినిమాలు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు కావు. మన స్టార్స్ చేసేది ఎక్కువగా యాక్షన్ సినిమాలే. కాబట్టి నేను వాళ్ళతో సినిమాను చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీగా ఉంది. త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది.































