ఉదయ్ కిరణ్ తెలుగు నాట పరిచయం అవసరం లేని పేరు… తొలి సినిమా “చిత్రం”తో పరిచయమై “నువ్వునేను” సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే కొన్ని అనివార్య కారణాలతో అయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆర్ధిక కారణాల వలనే అయన తనువు చాలించారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి కొన్ని వివాదాస్పద వ్యాఖలు చేసారు. కుటుంబ కలహాలతోనే అయన మరించాడనే అనుమానాలను రేకెత్తించారు. పనిలో పనిగా ఉదయ్ కిరణ్ భార్య విషిత మీద పలు అనుమానాలున్నాయని సంచలన వ్యాఖలు చేసారు.

అసలు ఉదయ్ కిరణ్ తరుపు కుటుంబంతో ఆమె కలవదని, ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి, 11రోజులు పూర్తైన తరువాత అసలు ఆమె ఉదయ్ తరపు కుటుంబాన్ని కలిసిందే లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఉదయ్ పేరున ఉన్న కొన్ని స్థిరాస్తులతో పాటుగా బంగారం, డబ్బు ఆమె తీసుకుందని… ఇప్పుడు తమతో కానీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఉదయ్ అక్క శ్రీదేవి చేస్తున్న వ్యాఖలు మరి కొన్ని కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఉదయ్ కిరణ్ అక్క అన్ని మాటలు అన్న తరువాత విషిత బయటకువచ్చి స్పందించకపోతే ఆమె చెప్పిన మాటలే నిజమని అందరు అనుకునే ప్రమాదముందని అంటున్నారు. ఉదయ్ మరణం వెనుక అయన భార్య విషితే కారణమని అయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కుడా భావించే అవకాశం లేకపోలేదు.

అయితే ఉదయ్ కిరణ్ అక్క చేసిన ఆరోపణలను ఆమె పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె స్పందించడం అనవసరం అనే భావనలో ఉన్నారని ఆమె సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అయితే అందరు మర్చిపోతున్న విషయాన్నీ మళ్ళీ కదపడం ఎందుకని ఉదయ్ భార్య సైలెంట్ గా ఉందని అంటున్నారు ఆమె సన్నిహితులు. మరి ఇప్పటికైనా ఆమె బయటకి వచ్చి అసలు విషయాలు చెబుతుందో లేదో చూడాలి..


































