హీరో రాజశేఖర్.. తాను స్వతహాగా డాక్టర్ చదివారు. ఫిబ్రవరి 4, 1962న తమిళనాడు రాష్ట్రంలోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో తల్లి తండ్రి శేఖర్, ఆండాల్ పిళ్ళై జన్మించారు. ఈయన తమిళ కుటుంబానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కాకపోతే, రాజశేఖర్ మాతృభాష తెలుగు. ఈయన పూర్వీకులు తెలుగు రాష్ట్రానికి చెందినవారు. ఇకపోతే ఈయన తండ్రి ఒక పోలీస్ అధికారి. ఆయన బాటలోనే మొదట్లో రాజశేఖర్ పోలీస్ అధికారి అవ్వాలనుకున్న చివరికి తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించారు. అలా ఆయన చెన్నై నగరంలో కొద్దికాలంపాటు డాక్టర్ ప్రాక్టీస్ కూడా చేశారు. రాజశేఖర్ కు డాక్టర్ కావాలని దానికంటే ముందు నటుడు కావాలనే ఆశ ఉండేది. మామూలుగా చాలాసార్లు వింటూనే ఉంటాం డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని. కానీ, హీరో రాజశేఖర్ మాత్రం మొదట డాక్టర్ ఆ తర్వాత హీరో అయ్యాడు.

ఈయన సినిమాల్లో నటించాలనే అవకాశం ఇప్పుడు కలిగిందంటే ఆయన కాలేజీ చదువుతున్న రోజుల్లో వారి స్నేహితులు తాను చాలా అందంగా ఉండాలని సినిమాల్లో ప్రయత్నిస్తే కచ్చితంగా హీరో అవుతాడు అని చెప్పడంతో ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. అయితే ఒకానొక సమయంలో గొడవల్లో తన తండ్రికి గాయాలు కావడంతో ఎంతో మంది డాక్టర్లు వచ్చి చివరికి ఆయనను కాపాడారు. దాంతో ఆయన కూడా డాక్టర్ కావాలని ప్రయత్నించి విజయం సాధించాడు. అలా జీవితం కొనసాగుతున్న సమయంలో మళ్లీ ఆయనకు సినిమాల వైపు మనసు మళ్లింది. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎమ్మెస్ చేయాలని భావించాడు. అయితే ఆయనకు తిరిగి సినిమాల వైపు మనసు మల్లడంతో ఆయన సినిమా ఇన్స్టిట్యూట్ లో చేరడానికి కూడా ఓ అప్లికేషన్ ను వేశాడు. అయితే ఆయనకు అటు ఎమ్మెస్ చేయడానికి సీటు వచ్చింది, అలాగే సినిమా ఇన్స్టిట్యూట్లో చేరటానికి కూడా అవకాశం లభించింది. ఆ సమయంలో ఆయన డాక్టర్ జీవితాన్ని పక్కనపెట్టి సినిమా ఇన్స్టిట్యూట్లో చేరటానికి సుముఖత చూపాడు.

అలా ఫుల్ మూవీస్ వచ్చేదాక అక్కడ నీకు వచ్చిన నటనను చూసి చూపించండి అంటూ కోరారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఎవర్నో ఒకర్ని అనుకరిస్తూ చేశారు. అయితే, రాజశేఖర్ మాత్రం తాను వచ్చిన వెంటనే మాత్రమే చేస్తూ తనదైన శైలిలో వారిని మెప్పించారు. అలా ఆయన ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత ప్రముఖ దర్శకుడు భారతీ రాజా సినిమా ఏబీఎన్ సంస్థకి కొత్త వారితో కలిసి చేయాలనుకున్నాడు. ఆ సమయంలో హీరో రాజశేఖర్ దర్శకుడు భారతీరాజా ను కలుసుకుని తన నటనా ప్రావీణ్యాన్ని చూపించాడు. ఆ సమయంలో ఆయనతో తనకు అవకాశం ఇస్తానని ప్రోత్సాహం ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో మరో కొత్త దర్శకుడు ఆయన హీరోగా అవకాశం ఇస్తామని చెప్పడంతో దానికి రాజశేఖర్ ఓకే అని చెప్పాడు. అయితే ఏం సంస్థతో సినిమా ఆలస్యంగా మొదలవుతుందని ఆ కొత్త డైరెక్టర్ కి హీరోగా నటిస్తాడని మాట ఇచ్చాడు. ఆ తర్వాత హీరో రాజశేఖర్ భారతీరాజా కలిసి తనకి ఇలాంటి అవకాశం వచ్చిందని చెప్పడంతో.. సరే అని భారతీరాజా చెప్పడంతో హీరో రాజశేఖర్ కొత్త డైరెక్టర్ తో సినిమాను మొదలు పెట్టాడు.

అయితే అలా జరుగుతున్న సమయంలో మరోసారి హీరో రాజశేఖర్ భారతీరాజా ను కలవడానికి వెళ్లినప్పుడు ఆయనను నువ్వు మళ్ళీ ఎందుకు నన్ను కలిసావు అని అడిగాడు. హీరో రాజశేఖర్ దాంతో ఆలా ఎలా అని అంటారు మీరు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పారు కదా అని అడగ్గా తాను కొత్త వారితోనే సినిమా తీయాలని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు వేరే వారితో సినిమా చేస్తున్నావు కదా నువ్వు ఎలా హీరోగా చేస్తావు అంటూ ఆయనను చెప్పి బయటకు పంపించేశాడు. హీరో రాజశేఖర్ చాలా బాధపడి అక్కడి నుంచి వచ్చేసాడు. అలా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి డైరెక్టర్ భారతీరాజా హీరో రాజశేఖర్ ను పిలిచి తన దగ్గర హీరో అవకాశం లేదని మరో అవకాశం ఉందని చెప్పడంతో మీరు మీరు ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తానని చెప్పడంతో.. చివరికి హీరోగా చేయాల్సిన సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ గా చేయడం జరిగింది. అలా సినిమా విడుదలైంది విజయం కూడా సాధించింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులోకి అనువదించాలని అరుణకిరణం అనే సినిమా పేరుతో రాజశేఖర్ ను హీరోగా పెట్టి సినిమా విడుదల చేస్తే ఆ సినిమా కూడా తెలుగులో బాగా హిట్ అయింది.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. అలా ఆ తర్వాత అంకుశం సినిమా తర్వాత ఆయన మరోసారి వెనక్కి తిరిగి చూడకుండా టాప్ హీరో గా చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే ఒకానొక దశలో ఆయనకు వరుస ఫ్లాపులు రావటంతో ఆయన అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఆయన చెన్నై నగరంలో ఉన్న రెండు ఇళ్లను, హైదరాబాద్ లోని ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్లీ ఎన్నో కష్టాలు పడి చివరికి ఎవడైతే నాకేంటి సినిమా ద్వారా మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన క్యారెక్టర్ ఏంటో నిరూపించుకున్నాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత గరుడ సినిమా, కల్కి సినిమాలు మరోసారి విజయం సాధించడంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ పైకి ఎక్కారు. ఇక హీరో రాజశేఖర్ నటన జీవితంలో మరో హీరో సాయి కుమార్ సహకారం ఎంతో ఉంది. సాయికుమార్ హీరో రాజశేఖర్ కి సినిమాలో గాత్ర దానం చేయడంతో ఆయనకు అంత పాపులారిటీ వచ్చి చేరింది. ఇకపోతే రాజశేఖర్ భార్య జీవిత ను వారిద్దరు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే 1991లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక ఉన్నారు. ఈ మధ్యకాలంలో హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా వైరస్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వారికి కరోనా వైరస్ నుండి బయటపడి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here