డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనేర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన “రెడ్” సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదలయింది. హీరో రామ్ కి జోడిగా అమృతా అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ పోతినేని నటించిన సినిమా కావడంతో అటు రామ్ అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను అందుకోవడంలో అభిమానులను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి.

కాగా.. త్వరలో ఈ సినిమా ఓటిటి లో విడుదల కానుంది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెట్వర్క్ ఈ రెండు సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ నెల 23 (February 23) నుంచి ఈ నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్ట్స్ రెండు ఒటిటి ప్లాట్ ఫాం లలో విడుదలకానుంది. ఈ రెడ్ సినిమా ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మళయాళం, బెంగాళీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here