రీల్ లైఫ్ లో అగ్ర హీరోలు – రియల్ లైఫ్ లో బడా బిజినెస్ మ్యాన్ లు !!

0
281

ఈరోజుల్లో ఆదాయం వచ్చే మార్గాలెన్నో ఉండగా కేవలం ఒక్క ప్రతిభను నమ్ముకుని ముందడుగు వేస్తే నిలబడటం చాలా కష్టం. పరుగెడుతున్న కాలంతో సమానంగా పోటీ పడుతూ మనమూ సక్సెస్ అనే రేసులో నెం.1గా నిలబడాలంటే మేధస్సు వుండాలి. ఏదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం వుండాలి. అన్నిటికన్నా ముందు మంచి వ్యాపార లక్షణాలుండాలి. ఇవన్నీ సినిమాలలో జరుగుతాయి. పేదవాడిగా ఉన్న హీరో కేవలం 5 నిముషాల పాట పూర్తయ్యే లోపు కోటీశ్వరుడైపోతాడు కానీ వాస్తవ జీవితంలో అది జరిగే పని కాదంటారేమో..! కానీ అది రీల్ లైఫ్ లో కన్నా రియల్ లైఫ్ లో కూడా సాధ్యమేనని నిరూపిస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు.

ఒకవైపు సినిమాలతో ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు రకరకాల బిజినెస్ లలో రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరోలు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి లేటెస్ట్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ వరకు బడా బిజినెస్ బాబులుగా ఖ్యాతి కెక్కుతున్న వాళ్ళ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..

చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవికి ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది. అంతేకాకుండా చిరు ఫుట్ బాల్ టీం పార్టనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

మహేష్ బాబు

మహేష్‌ బాబు మంచి బిజినెస్‌మన్ అనడానికి నిదర్శనం ఆయనకు సినీ నిర్మాణ సంస్థ జి.మహేష్‌ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. అలాగే ఏఎంబీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌ను కూడా ఇటీవలే ఏర్పాటు చేశారు. త్వరలోనే ‘హంబుల్ కో’ అంటూ స్టైలింగ్ కి కొత్త డెస్టినేషన్ ని లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించి దీనికి సంబంధించిన వివరాలను కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు ప్రిన్స్.

విజయ్ దేవరకొండ

లేటెస్ట్ సెన్సేషన్ హీరో విజయ్‌ దేవరకొండ కూడా సినిమాలతో పాటు బిజినెస్ పై కూడా దృష్టి పెట్టారు. ఈమధ్యనే ‘రౌడీ క్లబ్’ అంటూ క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ చేశాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో కొత్త స్టైల్ ఐకాన్ లా అవతరించిన విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ గా ఈ అప్పరెల్స్ బిజినెస్ లో రాణిస్తున్నాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ ఎం.కిచెన్‌ పేరుతో ఇంటర్నేషనల్‌ బ్రూవింగ్‌ కంపెనీని ప్రారంభించారు. దీనికింద 800 జూబ్లీ పేరుతో బ్రూవింగ్‌, నైట్‌క్లబ్‌, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. 2016 లోనే బిజినెస్ మెన్ అనిపించుకున్న బన్నీకి ఆ తరవాత B-Dubs అనే స్పోర్ట్స్ బార్ లో పార్టనర్ షిప్ కూడా వుంది.  సిల్వర్ స్క్రీన్ పై స్టైలిష్ స్టార్ అనిపించుకున్న ఈ మెగా హీరో,  బిజినెస్ లో కూడా అంతే సక్సెస్ ఫుల్ అనిపించుకున్నాడు.

రామ్ చరణ్

రామ్‌చరణ్‌ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగానే కాకుండా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకెళ్తున్నారు. ఒకవైపు ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కి ఓనర్ గా అలాగే మరోవైపు నార్మల్ లైఫ్ టు లావిష్ లైఫ్ వరకు దేన్నైనా ఈజీగా లీడ్ చేసే మెగా హీరోగా హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ బిజినెస్ లో మెగా స్పీడ్ తో లాభాలు అందుకుంటున్నాడు.

రానా దగ్గుబాటి

ముందు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ అనిపించుకున్నాకే తర్వాతనే స్టార్ హీరో అయ్యాడు రానా. సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ లోను నాలెడ్జ్ ఉన్న రానా, మరోవైపు ‘CAA KWAN’ ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ కంపెనీలో పార్ట్ నర్ కూడా చేరాడు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ అధినేతగా కళ్యాణ్ రామ్ పలు చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. దీంతోపాటు కల్యాణ్ రామ్‌కు వీఎఫ్‌ఎక్స్‌ వ్యాపారం కూడా ఉంది.

జగపతి బాబు

ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని, మళ్లీ విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ ను మొదలెట్టిన జగపతి బాబు ఈమధ్యనే టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ప్రారంభించారు. వెండితెరపై ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసే జగ్గూ భాయ్ కూడా బిజినెస్ మ్యానే. ‘క్లిక్ సినీ ఆర్ట్’ అనే ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ కంపనీని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు.

నాగార్జున

నాగార్జునకు ఎన్‌ గ్రిల్స్‌ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయన కూడా కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు కూడా బిజినెస్ పార్టనర్. నాగ్ ఏ బిజినెస్ అయినా చేయగలడు అనడానికి ఉదాహరణగా ఆయన N-కన్వెన్షన్ తో పాటు మరెన్నో నాన్ సినిమా రిలేటెడ్ బిజినెస్ ని కూడా అంతే సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నారు.

మోహన్ బాబు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబుకు ప్రొడక్షన్‌ హౌస్‌తో పాటు శ్రీవిద్యా నికేతన్‌ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.

వీళ్లతో పాటు సందీప్ కిషన్ లాంటి నవతరం హీరోలు కూడా నాన్-సినిమా బిజినెస్ లో ఉన్నారు.
చదివారుగా రీల్ లైఫ్ లో హీరోలైన వీళ్ళు రియల్ లైఫ్ గా బడా బిజినెస్ బాబులై ఎలా సంపాదిస్తున్నారో.. వీలైతే మీరూ ఓ బిజినెస్ మొదలు పెట్టండి మరి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here