Naga Shourya: టాలీవుడ్ లో హీరో లు అందరు చాలామటుకు ఎవరో ఒక హీరో, హీరోయిన్, నాటినటులతో రిలేషన్ ఉన్నావారే అయ్యివుంటారు. విశేషం ఏంటంటే 60% మంది ఇండస్ట్రీ లో వున్న వారు ఇలా ఎవరితో ఒకరితో రెలషన్ తో కనెక్ట్ అయ్యి వుంటారు. చాలా మటుకు తెలుగు సినిమా టాప్ హీరోలు అంతే నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఇంకా ఘట్టమనేని ఇలా వీళ్లకు సంబందించిన వారసులే హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ కుటుంబాలకు సంబందించిన రెండవ తరం ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. అంతే కాదు ఈ కుటుంబాలకు సంబందించిన మూడవ తరం కూడా తెర మీదకు రావడానికి సిద్ధంగా వున్నారు.

ఇలా టాలీవుడ్ లో మనకు తెలిసిన రిలేషన్ లే కాకుండా ఇంకా చాలా మంది చిన్న చిన్న నటి నటులతో బంధుత్వాలు కలిగివుంటారు.ఇలానే యంగ్ హీరో అయినా నాగశౌర్య ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో బంధుత్వం కలిగివునా సంగతి చాలా మందికి తెలియదు.బంధుత్వం అంతే దూరపు చుట్టం కాదు సొంత మేనత్త అవ్వడం విశేషం.

హీరో నాగశౌర్య మేనత్త ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎవరంటే….
ప్రస్తుతం వున్న యంగ్ హీరోలలో నాగశౌర్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కృష్ణ వ్రీందా విహారి తో మనముందుకు రాబోతున్నాడు.వెంకీ కుడుముల దర్శకత్వం లో సొంత బ్యానర్ ఐనా ఐరా క్రియేషన్స్ లో శౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మించిన ఛలో సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నాడు. నాగశౌర్యా వాళ్ళ మేనత్త కూడా సిని ఇండస్ట్రీ చెందిన వారు అని అతి కొద్దిమందికే తెలుసు.ఆమె ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతాశ్రీ. లతాశ్రీ వాళ్ళ సొంత అన్న కొడుకు నాగశౌర్య అంట.ఐతే రెండుకుటుంబాల మధ్య మాటలు లేకపోవడం వలన ఈ విషయం కొద్దిమందికే తెలుసు.

రెండు కుటుంబాల మధ్య మాటలు లేవని లతాశ్రీ నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆ కుటుంబం గురించి మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టం కనపరచ్చలేదు.ఐతే సొంత అన్న కొడుకు అవ్వడం తో నాగశౌర్యా అంతే తనకు ఇష్టం అనే చెప్పింది.తన అమ్మ ఉన్నప్పుడు ఆమెతో కలిసి నాగశౌర్య నటించిన సినిమాలలో ఊహలు గుసగుసలాడే సినిమా చూశానని చెప్పింది.



























