ప్రేక్షకుల పల్స్ తెలిసి పాడే అతికొద్దిమంది సింగర్స్ లో పర్ణిక మాన్య ఒకరు. కోయిల కూసినట్టు, చిలక పలికినట్టు ఆమె గొంతుతో పాడిన ఏ పాట అయిన వినసొంపుగా ఉంటుంది. తేనెలొలుకు ఆ తియ్యదనం తెలుగులో పాడే ఆమె గానం. ఎంతోమందికి మానసిక ఊరటను కలిగిస్తుంది. ఒక రకమైన గొంతులో గార తో ఆమె పాడే పాట ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుంది.

వర్ధమాన గాయకురాలు పర్ణిక మాన్య మూడవ తరగతి వరకు కరీంనగర్ లో చదివి ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో ఉన్నత విద్య హైదరాబాద్ లోనే పూర్తిచేసింది. తనకు చిన్నప్పుడు డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. డాన్స్ చేస్తూనే పాటలు పాడేది. అలా ఒక సందర్భంలో పర్ణికమాన్య నానమ్మ ఆమెలో ఒక గాయకురాలు దాగుందని గుర్తించి, ఆమెకు సంగీత శిక్షణ ఇవ్వాలనుకుంది. అయితే పర్ణిక మాన్య నానమ్మ గారు కర్ణాటక సంగీతాన్ని పిల్లలకు నేర్పిస్తూ ఉండేది. ఆ క్రమంలో పర్ణిక మాన్య తనకు ఇష్టం లేకున్నా నానమ్మ చెప్పే క్లాసులకు హాజరు అవుతూ ఉండేది. అలా తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తను కూడా పాడగలనని ఓ నిర్ణయానికి పర్ణిక మాన్య వచ్చారు. ఆ తర్వాత రమణాచారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళింది.

అలా రమణాచారి గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్న తరుణంలో సినిమాలో ట్రాక్ పాడడానికి తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులను మ్యూజిక్ డైరెక్టర్స్ వద్దకి పంపించేవారు. ఆ క్రమంలో సినిమా లో పాడడానికి పర్ణిక మాన్య కూడా అవకాశం వచ్చింది. అలా ఆమే సోలోగా “పరారే” అనే చిత్రంలో పాడారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ తీసిన చిత్రం “పోతే పోనీ” అనే చిత్రంలో గీతా మాధురి తో కోరస్ పాడడానికి వెళ్ళింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస మూవీలో “గరంగరం” సాంగ్ అనే పాటను పర్ణిక మాన్య పాడడం జరిగింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం చిత్రంలో కూడా ఒక సాంగ్ పాడారు. ఇలా పాడుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేద్దామనుకున్నారు.

ఆ క్రమంలో షిప్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న సాయి నిఖిలేశ్వర్ ను చూసి పర్ణిక మాన్య తో వివాహం చేశారు. పర్ణికమాన్య నాన్నగారు సినిమాలు, టి.వి సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే‌ పర్ణిక మాన్య పెద్దమ్మ వాళ్ళ కొడుకు స్వర్గీయ ఉదయ్ కిరణ్, అనగా పర్ణిక మాన్య కు ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here