తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా రీమేక్ చిత్రాలు తెరకెక్కడం మనం చూస్తూనే ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎన్ని రీమేక్ సినిమాలు చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా మలయాళం తమిళం చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే అలవాటు మన తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పటినుండో ఉంది. తమిళ సినీ కళాకారులకు చాలా క్రియేటివిటీ ఉండడంతో వారి సినిమాలు చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆదరిస్తారు. వాటిలో బాగా హిట్ అయిన సినిమాలను మన తెలుగు వాళ్ళు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ లను తమ సొంతం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మలయాళంలో మమ్ముట్టి చేసిన సినిమాలు తెలుగులో చిరంజీవి చేస్తాడు. తమిళ హీరో విజయ్ చేసే సినిమాలను పవన్ కళ్యాణ్ రీమేకులు చేస్తాడు. సత్యరాజ్ శరత్ కుమార్ చేసే సినిమాలను మోహన్ బాబు రీమేకులు చేస్తారు. ప్రభు సినిమాలను వెంకటేష్ చేస్తాడు. ఈ విధంగా తమిళ మలయాళ హీరోల సినిమాలకు రీమేక్ గా సృష్టిస్తారు మన తెలుగు హీరోలు. అయితే ఇలాంటి తొమ్మిది రీమేక్ సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పసివాడి ప్రాణం

1987వ సంవత్సరంలో విడుదలైన పసివాడి ప్రాణం చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన పూవిన్ను పుదియ పూంతెన్నాల్ రీమేక్ కాగా… చిరంజీవి మన నేటివిటీకి తగ్గట్టుగా నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ చిత్రం లో బ్రేక్ డాన్స్ వేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన చిరంజీవి తనదైన శైలిలో చిత్రం హిట్ అవ్వడానికి దోహదపడ్డాడు. ఈ చిత్రం దాదాపు ఆరు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది అంటే ఇది ఇది పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
చంటి

1991వ సంవత్సరంలో విడుదలైన చంటి సినిమా చిన్నతంబి అనే తమిళ సినిమాకి రీమేక్ కాగా… తెలుగులో విక్టరీ వెంకటేష్ మీనా హీరో హీరోయిన్స్ గా నటించారు. ఒరిజినల్ మూవీ లో చంటి పాత్రలో ప్రభు నటించగా… అతడి సరసన కుష్బూ నటించింది. ఈ సినిమా తమిళంలో 47 సెంటర్ లో భారీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. తమిళంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో తీస్తే భారీ హిట్ అవుతుందని విక్టరీ వెంకటేష్ భావించి దాన్ని తెరకెక్కించగా… ఈ సినిమా ప్రతి థియేటర్ లో 100 రోజులపాటు ఆడింది. దీంతో తమిళ పరిశ్రమ పుణ్యమా అంటూ వెంకటేష్ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ ని వేసుకున్నాడు.
ఘరానా మొగుడు

చిరంజీవి, వాణి విశ్వనాథ్, నగ్మా ప్రధానపాత్రలలో నటించిన ఘరానా మొగుడు చిత్రం 92 వ సంవత్సరంలో విడుదలైన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి పదికోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా పేరొందింది. అయితే ఈ సినిమా తమిళంలో కూడా మన్నన్ (యువరాజు) గా తెరకెక్కగా రజినీకాంత్ కథానాయకుడు పాత్రలో నటించాడు. నగ్మా పాత్రని విజయశాంతి, వాణీ విశ్వనాథ్ పాత్రని కుష్బూ పోషించారు. అయితే ఈ రెండు చిత్రాలకి మూలం ఒరిజినల్ కన్నడ సినిమా అయిన “అనురాగ అరళితు”. ఒరిజినల్ సినిమాలో రాజ్ కుమార్ మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు.
సూర్యవంశం

వెంకటేష్ హీరోగా నటించిన తెలుగు చిత్రం సూర్యవంశం 1992వ ఈ సంవత్సరంలో విడుదలైన బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే 1997 లో తమిళంలో ఇదే పేరుతో వచ్చిన సినిమాకు సూర్యవంశం సినిమా రీమేక్ కాగా… ఒరిజినల్ సినిమా కంటే వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
హిట్లర్

మమ్ముట్టి హీరోగా నటించిన హిట్లర్ సినిమా ని కూడా తెలుగులో అదే పేరుతో రూపొందించే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు చిరంజీవి.
పెదరాయుడు

మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు రీమేక్ కాగా… తెలుగులో ఈ సినిమా అత్యంత ప్రేక్షకాదరణ పొందే మోహన్ బాబుకు కోట్ల రూపాయలను సంపాదించిపెట్టింది. 1995 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం మోహన్ బాబు సినీ జీవితంలో అతిపెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుది సలహా ఇచ్చింది రజనీకాంతే. పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ పదినిమిషాలు కనిపించినప్పటికీ ఆ క్యారెక్టర్ అద్భుతంగా పండింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మోహన్ బాబు కూడా తన ఇతర సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా చక్కగా మంచిగా డైలాగులు చెప్పి ప్రేక్షకుల మనసును చూరగొన్నాడు.
నువ్వొస్తావని

2000వ సంవత్సరంలో విడుదలైన నువ్వొస్తావని సినిమాలో నాగార్జున సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి అంటూ నాగార్జున అప్పట్లో తెలుగు సినీ అభిమానులను బాగా అలరించాడు చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా తమిళంలో విజయ్ హీరో గా నటించిన థుల్లధ మాణముమ్ తుళ్ళుమ్ సినిమాకి రీమేక్. నువ్వొస్తావని సినిమా 16 కోట్ల రూపాయలను వసూలు చేసి పెట్టి పెద్ద సంచలనం సృష్టించింది.
ఖుషి

2001వ సంవత్సరంలో విడుదలైన ఖుషి సినిమాలో పవన్ భూమిక నటించిన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే ఈ సినిమా కూడా తమిళంలో ఎస్.జే సూర్య తెరకెక్కించిన ఖుషి సినిమాకి రీమేక్. ఒరిజినల్ మూవీలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించారు. తమిళంలో తెలుగులో ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచి పవన్ కళ్యాణ్, విజయ్ పాపులారిటీని బాగా పెంచేశాయి.
ఠాగూర్

2003వ సంవత్సరంలో హీరోగా నటించిన ఠాగూర్ చిత్రం తమిళంలో విజయవంతమైన రమణ చిత్రానికి రీమేక్ కాగా… దగ్గర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా తెలుగులో సంచలనం సృష్టించింది చిరంజీవికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఏది ఏమైనా కరువు లో ఉన్న రైతు వర్షం పడుతుందేమో అని ఆకాశానికేసి చూసినట్టు… డిజాస్టర్లలో ఉన్న మన తెలుగు హీరోలు కూడా హిట్స్ తమ ఖాతాలో వేసుకుందామని తమిళ మలయాళ సినిమాల వైపు చూస్తారని తెలుస్తోంది.



























