రేణు దేశాయ్.. తెలుగువారంరికీ పరిచయం అవసరం లేని పేరు. నిత్యం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉండే రేణు దేశాయ్. తాజాగా తన కొడుకు అకీరా గురిచి రేణు దేశాయ్ పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులగా అకీరాకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ గా మారుతోంది. అకీరా సినీ ఎంట్రీ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ రేణుని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

దీనిపై స్పందిస్తూ రేణు దేశాయ్ అసలు ఇది అకీరా సినీ ప్రవేశం గురించి మాట్లాడే సమయం కాదు. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం గురించి అందరూ భయపడుతున్న ఈ పరిస్థితుల్లో అకీరా ఎంట్రిపై తానేమీ మాట్లాడలేనని, కానీ ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీ అందరితో పంచుకుంటానని రేణు చెప్పారు.. దీనితో పవన్ వారసుడిగా అకీరాను సినీరంగ ప్రవేశం గ్యారెంటీ అని అంతా ఫిక్సయ్యారు.
ఈ నేపధ్యంలో అకీరా నందన్ గురించి తాజగా రేణు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. తన కొడుకు అకీరాతో దిగిన ఒక ఫోటో షేర్ చేస్తూ చేసిన రేణు.. ”ఈ ప్రపంచంలో అకిరా ఒక్కడే, నా బుగ్గలు నొప్పిపుట్టే అంతవరకు నన్ను నవ్వించగలడు! నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగలడు అతను వేసే జోకులు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. నా జోకులే నన్ను నవ్విస్తున్నట్లు ఉంటుంది” అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టింది.




























