ఆ సమయంలో ఆయన నా మొహం కూడా చూడలేదు.. రేణు దేశాయ్!

0
163

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడమే కాకుండా సామాజిక సేవలను గురించి పలు సందర్భాలలో వివరిస్తుంటారు.అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల సినిమా ఆగిపోవడంతో రేణు దేశాయ్ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

జీ తెలుగులో ప్రసారం కాబోయే డ్రామా జూనియర్స్ కు రేణుదేశాయ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఎంతోమందిలో ఆలోచనను కలిగించాయి. ఈ క్రమంలోనే గత ఆదివారం సోషల్ మీడియా, మీడియా,పలు వెబ్సైట్లు రాసే రాతలు వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు ఎదుర్కొనే ఇబ్బందులను గురించి చేసిన స్కిట్ చూసి ఎమోషనలయ్యారు. ఈ విధంగా వార్తలు రాయడం వల్ల వారు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించి వార్తలు రాయండి అంటూ ఆమె తెలిపారు.

ఇక ఈ వారంలో జరగబోయే ఎపిసోడ్ లో మొట్టమొదటి సారిగా రేణు దేశాయ్ తన కూతురు ఆద్యాను బుల్లి తెరకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఆధ్య ఈ కార్యక్రమానికి రావడంతోనే రేణూ దేశాయ్ గురించి, అమ్మదనం గురించి ఎంతో గొప్పగా చెప్పేశారు. తాజాగా ఈ వారంలో జరగబోయే డ్రామా జూనియర్స్ విడుదల చేశారు.

ఈ ప్రోమోలో ఆడపిల్ల పుడితే భర్త హింసించే బాధలకు భార్య పడే కష్టాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ స్కిట్ చూసిన రేణు దేశాయ్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా తెలిపారు. తాము కూడా ఇద్దరు ఆడపిల్లలమని, తనకన్నా ముందు అక్క పుట్టింది.తర్వాత నేను పుట్టడంతో మళ్లీ ఆడపిల్ల పుట్టిందని తన తండ్రి కొద్ది రోజుల వరకు తన మొహం కూడా చూడలేదని రేణు దేశాయ్ చెప్పిన మాటలకు అక్కడున్న వారందరూ ఎమోషనల్ కాగా, ఆద్య తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here