పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఇక రేణు తన ఫస్ట్ చిత్ర కధానాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘జానీ’ చిత్రంలో మాత్రమే హీరోయిన్ గా నటించింది. ఇంతవరకూ రేణు దేశాయ్ అంటే ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం.

2011లో పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలోనే ఉంటోంది. ఆ తర్వాత దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రం కూడా తీసింది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తనకు నచ్చిన పనులు చేస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటుంది. లేటెస్టుగా తన 2 లగ్జరీ కార్లని అమ్మేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది రేణూ దేశాయ్. వివరాల్లోకి వెళ్తే..

మారిషస్ లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ తన 2 లగ్జరీ కార్లని అమ్మేసింది. రేణు దేశాయ్ చేసిన పనికి సినీ ప్రముఖులంతా షాకవుతున్నారు. `దయచేసి అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనండి. ప్రతీరోజు వాడే పెట్రోల్, డీజిల్ కు బదులుగా ప్రత్యామ్నయ వనరులను అన్వేషించండి. నేను ఇంధనంతో నడిచే ఆడీ ఏ6 , పోర్షే బాక్సర్ కార్లను అమ్మేసి ఈ ఎలక్ట్రికల్ హ్యుందాయ్ కారుని తీసుకున్నాను. నా 2 కార్లను అమ్మడం కష్టమైన విషయమే అయినా మారిషస్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివి ఈ నిర్ణయం తీసుకున్నాను.
పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో ఈ భూమిపై వుండే జీవరాశికి క్యాన్సర్ ముప్పును తీసుకొస్తున్నాం. కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించడమే సరైన మార్గం’ అంటూ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలియ జేసింది రేణు దేశాయ్. అయితే ఎప్పుడూ రేణు దేశాయ్ షేర్ చేసే పోస్ట్‌లకు నెగెటివ్ గా స్పందించే నెటిజన్స్ ఈ లేటెస్ట్ పోస్ట్‌పై పాజిటివ్‌గా స్పందించడం విశేషం.