Resul Pookutty : రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇక బాలీవుడ్ జనాలకు బాగా నచ్చేసింది. అయితే కొంత మంది బాలీవుడ్ జనాలకి మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా విజయం రుచించలేదు. నోటికోచ్చినట్టు సినిమా మీద కామెంట్స్ చేసారు. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా ప్రశంసించిన సినిమాను కొంతమంది విదేశీయులు మాత్రం గే కథగా కామెంట్స్ చేసి ట్రోల్ చేసారు.

గే కథ అన్న రసూల్ పూకుట్టి…
కొంతమంది విదేశీయులు గే కథ అంటూ ట్రోల్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ కి చెందిన సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను గే కథ అన్నారు. ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ సినిమా చెత్త అంటూ కామెంట్ చేయగా ఆ కామెంట్ కు రిప్లై గా ‘గే కథ’ అంటూ కామెంట్ చేసారు. ఇక ఈ కామెంట్ కు చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రిప్లై ఇచ్చారు. ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ అయ్యుండి ఇలాంటి వాఖ్యలు చేస్తారని అనుకోలేదు.

Saw 30 minutes of garbage called RRR last night.
— Munish (@MunishBhardwaj) July 3, 2022
I don't think @RRRMovie is a gay love story as you say but even if it was, is "gay love story" a bad thing? How can you justify using this ? Extremely disappointed that someone of your accomplishments can stoop so low! https://t.co/c5FmDjVYu9
— Shobu Yarlagadda (@Shobu_) July 4, 2022
సరే అది గే స్టోరీ అయినా తప్పేంటి? అదేమైనా చెడ్డ విషయమా? నువ్వు అలా ఎలా అనగలవు, నీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలవు, మీరు ఇలా దిగజారడం నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేసారు. రసూల్ చేసిన ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది అలాగే చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.



























