RGV : వివాదాల జీవి ఆర్జీవి ఏదో ఒక విషయంలో ఒక వర్గాన్ని గెలికి ఆనందించడం బాగా అలవాటు. ఒకప్పుడు వర్మ సినిమాలకు జనం ఫిదా అయ్యేవాళ్ళు. ప్రస్తుతం ఆయన తీసే సినిమాలను ఆయన డైహార్డ్ భక్తులు కూడా చూడటం మానేశారు. ఇపుడు తీస్తున్న సినిమాలకు రివ్యూలు ఇవ్వడం కూడా మానేశారు. అంతలా దిగజారిపోయిన ఆర్జీవి ప్రస్తుతం సినిమాలతో కన్నా ట్విట్టర్ పోస్టులతో బాగా అందరి నోట్లో ఉంటున్నాడు. తాజాగా పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు వర్మ.

ఆ హీరోకి విష్ చేసి… పవన్ కి విష్ చేయని ఆర్జీవి…
పవన్ కళ్యాణ్ అంటే ఆర్జీవి కి చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పాడు. మొన్నామధ్య పవన్ మీద సినిమా కూడా తీసాడు. అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్తే ఆర్జీవి ఈ విషయంలో కూడా తన మార్కు చూపించాడు. సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు నాడే కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుధీప్ పుట్టినరోజు. ఇక ఆర్జీవి తన ట్విట్టర్ వేదిక ద్వారా కిచ్చా సుదీప్ కి విష్ చేసాడు.

Here’s wishing the most versatile and the only STAR/ACTOR ever @KicchaSudeep a very very happy birthday ????????????????????
— Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2022
వన్ అండ్ ఓన్లీ స్టార్, యాక్టర్ అంటూ విష్ చేసాడు. ఇక ఈ ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని తెలిసి కూడా వర్మ కావాలనే పవన్ కి పుట్టినరోజు విష్ చేయకుండా సుదీప్ కి మాత్రమే చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇంతకన్నా గొప్పగా నీనుండి ఏం ఆశించగలంలే అంటూ వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. కావాలనే వర్మ ఇలా చేశాడా లేకపోతే మర్చిపోయాడో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట్లో ఇది హాట్ టాపిక్ అయింది.



























