సినిమా ఇండస్ట్రీలో వివాదాల పరంగా మరే దర్శకునికి లేనంత పేరు, గుర్తింపు రామ్ గోపాల్ వర్మకు ఉంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎవరి గురించి సినిమాలు తీస్తాడో ఎవరూ చెప్పలేరు. మొన్నటివరకు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేసి సినిమాలను తెరకెక్కించారు. అయితే ఆర్జీవీ సినిమాలు ట్రైలర్ సినిమాలు మాత్రమేనని సినిమాలో విషయం ఉండదని ప్రేక్షకులకు కూడా తెలుసు.

అయితే అన్నీ తెలిసినా గతంలో ఆర్జీవీ తీసిన హిట్ సినిమాల వల్ల ఇప్పటికీ ఆయనను అభిమానించే అభిమానులు ఉన్నారు. రిలీజ్ రోజునే థియేటర్లలో ఆర్జీవీ తీసిన సినిమాలు చూసి వీళ్లు మళ్లీ రామ్ గోపాల్ వర్మ తమను మోసం చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ గోపాల్ వర్మ సీఎం కేసీఆర్ ను స్పూర్తిగా తీసుకొని సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆర్జీవీ ఉన్నపళంగా తెలంగాణ గురించి సినిమా తీయాలనుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే ఆర్జీవీ కేసీఆర్ ను మెప్పించేలా సినిమా తీస్తారో నొప్పించేలా సినిమా తీస్తారో చూడాల్సి ఉంది. ప్రముఖులను టార్గెట్ చేసి సినిమాలు తీయడం ద్వారా సినిమాలు ఫ్లాప్ అయినా గిట్టుబాటు అవుతుందని భావించి వర్మ ఈ కొత్త ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసి ఉండవచ్చని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ను పోలి ఉన్న ఒక వ్యక్తిని సైతం ఆర్జీవీ ఎంపిక చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోందని తెలుస్తోంది.
నిజ జీవిత పాత్రలను పోలి ఉండేలా నటులను ఎంచుకోవడంలో కూడా రామ్ గోపాల్ వర్మకు ఆయనే సాటి. ఇప్పటివరకు ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిన ఆర్జీవీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై పడ్డారు. వర్మ దృష్టిలో పడితే ఆ నటుడి జాతకం కూడా మారుతుంది. కేసీఆర్ పాత్ర పోషించే అవకాశం రావడంపై రాజారమేష్ హర్షం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.































