ఆర్జీవీలో ఇంత మానవీయ కోణం ఉందా ! చెన్నకేశవులు భార్యకు బ్లాంక్ చెక్ ?

0
470

“కాంట్రావర్సీ” లకు కేర్ ఆఫ్ అడ్రెస్స్, నిత్యం వివాదాలతో కాపురం చేసే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా ఉన్నట్టుగా అనిపించింది కానీ ఉన్నట్టుండి సడెన్ గా ఆర్జీవీ అని గుర్తోచిందో ఏమో, హఠాత్తుగా మళ్ళి తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో వివాదాస్పద సినిమా తీయడం మొదలు పెట్టాడు. అదేనండి ఇటీవలే హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన “దిశ” ఘటన నేపథ్యంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా కోసం తన పనిని చెక చెకా చేసుకుపోతున్నాడు.. అయితే ఈ సినిమాకి “దిశ” అని టైటిల్ కూడా పెట్టేసాడు. అసలు ఆ అమానుష సంఘటన జరగడానికి గల కారణాలు, దిశ పట్ల ఆ నలుగురు చేసిన అత్యంత ఘోరమైన చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయో తన సినిమాలో చూపిస్తానని అంటున్నాడు. అంతేకాదు ఆ సంఘటన జరిగిన ప్రదేశాల ఫొటోలతో, తను తీయబోతున్న సినిమా గురించి, సినిమా టైటిల్ ని కూడా ట్విటర్ లోని తన ఖాతాలో వెల్లడించాడు.

అయితే తాజాగా ఈ ఘటనలో నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకున్న రాంగోపాల్ వర్మ ఆమె గాథ విని చలించిపోయి చెన్నకేశవులు భార్యకు బ్లాంక్ చెక్ ఇచ్చి, ఆ చెక్ పై ఆమెకు నచ్చినంత అమౌంట్ రాసుకోమని చెప్పినట్టు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎవరినో ఒకరిని గెలుకుతూ నేను మోనార్క్ ని అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మలో ఇంతటి మానవీయకోణం ఉందా అని అయన అభిమానులు ఆనందపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here