వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనాపై ప్రశంసలు కురిపిస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసారు. అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ధాకడ్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా చిత్రీకరణలోని తన చేతిలో పొడవాటి తుపాకీ పట్టుకుని, ముఖంపై రక్తంతో యాక్షన్ సీన్‌లో ఉన్న ఫొటోను ట్వీటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అ ఫోటోలో ఆమె కష్టం అంతా తెలుస్తుంది.

అయితే ఈ పోస్టర్ చుసిన ఆమె అభిమానులు, కొద్దిమంది సేలేబ్రేటిస్ కూడా కంగనాను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు ఆర్జీవీ కూడా ఈ ఫొటో చూసి స్పందించారు. నా మొత్తం సినిమా కెరీర్‌లో నేను చూసిన బెస్ట్ క్లోజ్‌అప్ ఫొటో ఇదే. ఇటువంటి పాత్రలో లీనమైన నటి ఎవరైనా ఉన్నారా? నాకు ఒక్కరు కూడా గుర్తుకు రావడం లేదు. నీలాంటి నటిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. హే కంగనా నువ్వో న్యూక్లియర్ బాంబ్ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. కానీ ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ వెంటనే డిలీట్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతంది. ఇక కంగనా నటిస్తోన్న థాకడ్ మధ్యప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
