టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గతంలో “నేను ‘పవర్ స్టార్’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. నా సినిమాలో ఒక సినీ స్టార్ రాజకీయాల్లోకి వస్తాడు. ఆ తర్వాత అతను ఎలా పతనం అవుతాడో అనేదే నా సినిమా కథ. నా సినిమాలో ఓ హీరో, ఓ రష్యన్ మహిళ, ముగ్గురు పిల్లలు ఉంటారు” అని ట్విటర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజాగా తన సినిమాలోని ఫస్ట్ లుక్ ఇదేనంటూ మరో పోస్ట్ షేర్ చేశాడు. ఆ ఫస్ట్ లుక్ లో ఉన్న వ్యక్తి అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉండటం సంచలనాన్ని సృష్టించింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.? RGVని తమ విమర్శలతో ట్వీట్టర్ లో ఓ మోత మ్రోగించారు. దీంతో RGV తాజాగా మరో ట్వీట్ ను షేర్ చేశాడు. ఆ ట్వీట్ లో RGV మాట్లాడుతూ.. “మీడియావాళ్ళు నా ‘పవర్ స్టార్’ చిత్రాన్ని ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథ అని తప్పుడు వార్తలు రాస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం.! నా సినిమా ఎవ్వరి బయోపిక్ కాదు, ఇదో కల్పిత కథ మాత్రమే. నా సినిమాలోని కథ ఓ సినీ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఎలా పతనం అవుతాడో అనే అంశం. నా కథ ఎవరైనా నిజ జీవిత వ్యక్తికి కానీ ఆ పాత్రకి కానీ పోలి ఉంటే అది కేవలం కో- ఇన్సిడెన్స్ మాత్రమే కానీ ఉద్దేశ పూర్వకం అస్సలు కాదు” అంటూ ఆయన తెలియజేశాడు.

RGV ట్వీట్ కు స్పందించిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. అయితే హీరో నిఖిల్ తన ట్వీట్ లో “శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్ధం అయిందిగా.?” అంటూ కామెంట్ చేశాడు. లేటెస్ట్ గా హీరో నిఖిల్ షేర్ చేసిన ఈ ట్వీట్ మన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ పర్మ ను ఉద్దేశించి చేసిందే.! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడంతో నిఖిల్ చేసిన కామెంట్స్ పై రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇస్తూ.. “అసలు ఆ నిఖిల్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళందరూ ఒక బానిసత్వానికి అలవాటు పడిపోయినవాళ్ళు” అంటూ తనదైన స్టైల్ లో వెరైటీగా స్పందించాడు



























