Richa Gangopadhyay : లీడర్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ. లీడర్ సినిమా తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయింది. రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్ సినిమాలోను ఆ తరువాత సారోచ్చారు సినిమాల్లో నటించింది. ఇక ప్రభాస్ తో మిర్చి సినిమాలో హీరోయిన్గా నటించింది. నాగార్జున భాయ్ సినిమాలో లీడింగ్ హీరోయిన్ గా అలరించింది. ఇక తమిళంలోనూ ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లిన రిచా అగ్ర హీరోయిన్ గా ఇక పీక్స్ లో తన కెరీర్ ఉంటుందని అందరూ అనుకున్నా రిచా మాత్రం అందరికి షాక్ ఇచ్చి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది. ఇక ఆ తరువాత అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకుంది.

రిచా కెరీర్ పతనానికి ఆ హీరోనే కారణమట…..

ఇక తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో అభిమానులతో ఫోటోలను పంచుకుని అభిమానులకు షాకిచ్చింది మిర్చి బ్యూటీ. అయితే ఇక రిచా గురించి ఒక గాసిప్ ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రిచా ఎందుకు అర్థాంరంగా సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది అనే అనుమానం అందరికీ ఉంది కానీ కారణాలు ఎవరికీ తెలియవు. ఇక ఇపుడు ఈ విషయానికి సంబంధించిన గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది.

రిచా సినిమా ఆఫర్స్ తో తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం సాగించిందట. ఆ హీరో కూడా ప్రేమించాడట. ఇద్దరూ హద్దులు దాటి రొమాన్స్ చేశారు కూడా. ఇక పెళ్లి మాట వచ్చేసరికి ఆ స్టార్ హీరో నీ అందానికి నేనేం సరిపోతాను అంటూ హ్యాండ్ ఇచ్చాడట. దీంతో అలా చీప్ గా మాట్లాడిన హీరో వల్ల హర్ట్ అయిన రిచా గంగోపాధ్యాయ ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయిందని ఇపుడు వినిపిస్తున్న టాక్. ఇక సినిమాలు వద్దనుకుని లండన్ వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.



























