“ప్రభాస్” అసలు ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండదేమో మన దేశంలో “బాహుబలి” ఒక్కసారిగా గ్లోబల్ లెవల్ యాంకర్ గా మారిపోయాడు. అంతకు ముందు ప్రభాస్ కొన్ని డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసినా బాహుబలి ఇచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఈ ఒక్క దెబ్బతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తరువాత సహా అనే ఫ్లాప్ సినిమా తీసినా సుమారు రూ.400 కోట్లకు పైగా వాసులు చేసింది అంటే ప్రభాస్ స్టామినా ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ అన్ని కలుపుకుని దాదాపు రెమ్యూనిరేషన్ రూ.75 కోట్ల వరకు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా #prabhas20 కూడా దాదాపు అదే అమౌంట్ తీసుకున్నాడట. ఇక అశ్వినీదత్ వైజయంతి మూవీస్ సినిమాకి సుమారు రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ ఆస్తుల విలువ భారీగానే ఉందట. ప్రభాస్ స్థిర, చర ఆస్తులు అన్ని కలిపి మొత్తం 7 వేల కోట్లకు పైమాటే అని అయన సన్నిహితుల సమాచారం. ప్రభాస్ నాన్నగారు సూర్యనారాయణ రాజు నిర్మాత. అప్పట్లో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజుతో చాలా హిట్ సినిమాలున్నాయి. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నై , బెంగుళురు లో స్థలాలు కొన్నారు. ఒక పలు నగరాల్లో ఫామ్ హౌస్ లు, కొబ్బరి తోటలు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. అంతేకాదు ఒక గ్రానెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అత్యంత ధనవంతుడైన హీరో మరెవరు లేరు అనేది వాస్తవం.




























