Ashoka Vanamlo Arjuna Kalyaanam : విశ్వక్ సేన్, దేవీ నాగవల్లి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ హీరో గా అశోక వనంలో అర్జున కళ్యాణం ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయినా రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే అశోక వనం లో అర్జున కళ్యాణం సినిమా విడుదల ముందు నుంచి కూడా ఈ సినిమాలో హీరోయిన్ అంటే రుష్కర్ థిల్లాన్ అని మాత్రమే తెలుసు. చిత్ర ప్రమోషన్లో కూడా ఈమె మాత్రమే పాల్గొన్నారు. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాలో ఒక హీరోయిన్ మాత్రమే ఉంది అన్న అపోహలో ఉన్నారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత మొదటి రోజునే అందరికీ హీరోయిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చింది సినిమా.

హీరోయిన్ ఇమేజ్ కొట్టేసిన సెకండ్ హీరోయిన్….
ఈ సినిమా విడుదలైన రోజు చూస్తే సినిమాలో సెకండ్ హీరోయిన్ సినిమాకు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. అసలు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉన్నారు అన్న సంగతి కూడా పెద్దగా తెలియలేదు అయినా కూడా సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నంతగా సెకండ్ హీరోయిన్ ఆకట్టుకుంది. రుష్కర్ థిల్లాన్ క్రెడిట్ మొత్తం సెకండ్ హీరోయిన్ అయిన రుతిక నాయక్ కొట్టేసింది. రుతిక నాయక్ వయసు 25 సంవత్సరాలు అయినప్పటికీ నమ్మశక్యంగా అనిపించలేదు, 16 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిల అందంతో నటనతో అందర్నీ ఆకట్టుకుంది.

అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం రుతిక నాయక్ ను ఎందుకు హైలెట్ చేయలేదొ ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా లో రుతిక నాయక్ నటనలో అందాన్ని చూసిన వారంతా టాలీవుడ్ మిడిల్ రేంజ్ సినిమాలకు మంచి హీరోయిన్ దొరికేసినట్టే అని అనుకుంటున్నారు. అంతలా ఈ అమ్మాయి అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాదు ఇప్పుడు ఈ అమ్మాయే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.



























