బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అధికారుల విచారణలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్సీబీ వర్గాలు రియాను విచారించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లాంటి పేర్లు వెలుగులోకి వచ్చినా ఆ వార్తను ఎన్సీబీ అధికారులు ఖండించారు. రకుల్, సారా అలీ ఖాన్ కు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.

తాము ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్న వారికి సంబంధించిన జాబితాను తయారు చేయలేదని…. అలాంటి జాబితాను తయారు చేస్తే మీడియాకు ఆ వివరాలను తప్పకుండా చెబుతామని అన్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసుతో తెలుగు నటులకు కూడా లింక్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్సీబీ అధికారులు తీగ లాగితే డొంకంతా కదులుతోందని బాలీవుడ్, శాండల్ వుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది.
సుశాంత్, రియా డ్రగ్స్ తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా డ్రగ్స్ గురించి దుమారమే చెలరేగుతోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే డ్రగ్స్ వాడే ఇతర నటీనటుల జాబితా కూడా వెలుగులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. విచారణ లోతుగా జరిపితే ఇండస్ట్రీలోని ప్రముఖుల జాతకాలు వెలుగులోకి వస్తాయని తెలుపుతున్నారు. అయితే కంగనా ప్రముఖుల పేర్లు చెప్పినా ఆ దిశగా ఎన్సీబీ దర్యాప్తు చేయలేదు.
బాలీవుడ్ లో 90 శాతం మందికి డ్రగ్స్ తో సంబంధం ఉందని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రకటనపై ఎన్సీబీ అధికారులు ఏమని స్పందిస్తారో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో సుశాంత్ ఆత్మహత్య కేసు పక్కదారి పడుతోందని… సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలో అసలు నిజాలు వెలుగులోకి రావట్లేదని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.



























