మహేష్ భట్‌కు 16 కాల్స్ చేసిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్…! రియా కాల్ రికార్డ్స్ లో సంచలనాలు..!

0
245

బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తీసే చిత్రాలు ఎప్పుడూ ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తూనే వుంటాయి. తాజాగా మహేష్ భట్‌పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. సుశాంత్ మరణం వెనుక మహేష్ భట్ ప్రమేయం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రియా చక్రవర్తితో సంబంధం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

సుశాంత్, రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్లో వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఈలోగా సుశాంత్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా సుశాంత్ కేసును CBI అధికారులు దర్యాప్తు చేయడంతో ఆ దర్యాప్తులో ‘నువ్వు నాతో ఉంటే మహేష్ భట్ నన్ను చంపేస్తాడని రియాతో సుశాంత్ చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ బలవాన్మరణం వెనుక మహేష్ భట్ పాత్ర ఉండొచ్చనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా మహేష్ భట్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ త్వరలోనే తాను చనిపోతానని చెప్పిన సంగతిని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఇదిలా వుండగా.. లేటెస్ట్ గా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుశాంత్‌ కేసును CBI కి అప్పగించడంతో దర్యాప్తు వేగవంతమైంది.

ఈ నేపథ్యంలో పోలీసులు గతేడాది రియా కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం రియా చక్రవర్తి బాలీవుడ్ చిత్ర నిర్మాత మహేష్ భట్‌కు 16 కాల్స్ చేయడంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అంతేగాక ఆమె తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో గత సంవత్సరంలో 1122 సార్లు మాట్లాడినట్లుగా కాల్ రికార్డ్ లో వుంది. రియా మేనేజర్‌, సుశాంత్‌ బిజినెస్‌ మాజీ మేనేజర్‌ శృతి మోదీకి 808 కాల్స్‌ చేశారు. తన సోదరుడు షోయిక్ చక్రవర్తి ఆమె తల్లి సంధ్య చక్రవర్తికి చాలాసార్లు ఫోన్‌ చేశారు. అయితే సుశాంత్‌ కేసులో సీబీఐ ఈమధ్య రియా, షోయిక్ ఇంద్రజిత్, రియా తల్లి సంధ్య చక్రవర్తితో సహా ఆరుగురిపై FIR దాఖలు చేసింది. అంతేగాక CBI దాఖలు చేసిన FIR జాబితాలో సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీ కూడా ఉన్నారు. అలాగే సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్‌, రియా అసిస్టెంట్ శామ్యూల్ మిరాండాపై కూడా FIR నమోదై వుండటం గమనించదగిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here