RK Roja : రోజా తెలుగులో మొదట రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తరువాత తెలుగులో అగ్ర హీరోలు అందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా వెలిగారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించారు. 1990 లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ లో మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో, ఇపుడు వైస్సార్సీపీ లో ఉన్నారు. ప్రస్తుతం రోజా టూరిజం సంస్కృతిక యువజన మంత్రి గా పదవిని చేబట్టారు. రాజకీయాల్లో బిజీ గా ఉంటూ… సినిమాలకు దూరమైనా బుల్లితెర మీద పలు కార్యక్రమాలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించినప్పటికీ మంత్రి పదవి చేబట్టిన తరువాత వాటికి కూడా దూరమయ్యారు.

దాదాపు 11 ఏళ్ళు ప్రేమలో…
రోజా తమిళ్ లో సెల్వమణి దర్శకత్వంలో ‘చెంబురతి’ సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అపుడే వీరిమధ్య ప్రేమ చిగురించందని చెప్పవచ్చు. అయితే రోజా సోదరులు తన కెరీర్ కోసం చాలా కడ్తపడ్డారట. రోజా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి వారిని సెటిల్ చెయ్యాలని భావించి, ప్రముఖ దర్శకుడు అయిన సెల్వమనిని ప్రేమించినప్పటికీ వెంటనే పెళ్లి చేసుకోలేదట.

రోజా తన సోదరుల సెటిల్మెంట్ కోసం 11 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ప్రేమను కొనసాగించారు. జీవితంలో చాలా కష్టాల అనంతరం 2002 లో డైరెక్టర్ సెల్వమణి ని వివాహం చేసుకున్మారు. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యారు రోజా. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.

































