RK Roja: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రోజా ఒకరు. ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వేలుకు వెలిగారు అయితే హీరోయిన్గా అవకాశాలు కోల్పోయిన ఈమె పలు సినిమాలలో తల్లి అత్త క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక రోజా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా మాత్రం కొనసాగారు ఇలా 10 సంవత్సరాల ఈమె రాజకీయ జీవితంలో జబర్దస్త్ కార్యక్రమాలలో సందడి చేశారు అయితే మంత్రి అయిన తర్వాత మాత్రం తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా తప్పుకున్నారు.
ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికలలో వైకాపా పరాజయం పాలయింది. ఇక రోజా కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రోజూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. తాను తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

RK Roja: క్యారెక్టర్ ఆర్టిస్ట్..
ఇక సినిమా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా బాహుబలి సినిమాలో శివగామి అత్తారింటికి దారేది సినిమాలో ఒక అత్త పాత్రలో లేకపోతే లాయర్ డాక్టర్ వంటి పాత్రలలో నటించాలని కోరుకుంటున్నాను రోజా తెలియజేశారు. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన రోజా గోలీమార్ మొగుడు వంటి సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి ఇప్పుడు ఈమె ఎలాంటి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.





























