Rocking Rakesh : ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ప్రసారమవుతూ ఇప్పటికీ ఏళ్లకు ఏళ్ళు గడిచిపోయినా ఆ షో ఇప్పటికి జనాలను అలరిస్తోంది. ఒకరకంగా టెలివిజన్ హిస్టరీలో లాంగ్ రన్ లో సక్సెస్ ఫుల్ గా ఇప్పటికీ మంచి రేటింగ్ తో నడుస్తోంది. అంతే కాకుండా ఈ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే చాలా మంది జబర్దస్త్ ను వీడి ఇతర ఛానెల్స్ కి వెళ్లిపోయారు, అలాంటి వారిలో జబర్దస్త్ లో కమెడియన్స్ గా దూసుకుపోయిన చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ ఉన్నారు. వేర్వేరు కారణాలతో వాళ్ళు జబర్దస్త్ వీడినా మళ్ళీ తిరిగి జబర్దస్త్ కి వచ్చేస్తారంటూ బాగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ మాట్లాడారు.

నాగబాబు మళ్ళీ వస్తారు… సుధీర్ గురించి అడగొద్ధు…
జబర్దస్త్ లో జడ్జెస్ అంటే నాగబాబు, రోజా గారే. ఇక యాంకర్ అంటే రష్మీ, అనసూయ. అంతలా షోలో భాగమయ్యారు వారు. ప్రస్తుతం షోలో అనసూయ, నాగబాబు, రోజా షోని వదిలి వెళ్లిపోయారు. ఇక వారు మళ్ళీ షోకి వస్తే చూడాలని ఎంతో మంది జబర్దస్త్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ విషయం గురించి రాకేష్ మాట్లాడుతూ నాగబాబు గారు రోజా గారు జబర్దస్త్ కుటుంబానికి పెద్దలు. తల్లిదండ్రుల వంటి వారు జబర్దస్త్ వాళ్ళ అడ్డా ఎపుడైనా వస్తారు అంటూ చెప్పారు.

నాగబాబు గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన రావాలనుకుంటే ఎపుడైనా వస్తారు అంటూ చెప్పాడు రాకేష్. ఇక సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ మళ్ళీ వస్తే బాగుంటుంది అయితే ఆయన గురించి మాట్లాడే రేంజ్ నాది కాదు, తను చాలా మంది అభిమానులను సంపాదించుకుని కెరీర్ లో మంచి స్థానానికి వెళ్లారు. ఆయన మళ్ళీ జబర్దస్త్ కి వస్తే చాలా బాగుంటుంది జబర్దస్త్ వదిలి వెళ్లిన అందరూ మళ్ళీ జబర్దస్త్ కి వస్తారు అంటూ ఆశాభావం వ్యక్త చేసాడు రాకేష్.
































