Featured

ఎలుకల దెబ్బకు జైలు ఖాళీ చేసిన అధికారులు.. ఎవరంటే?

Published

on

సాధారణంగా మన ఇంట్లోకి ఒక ఎలుక వచ్చిందంటే చాలు. ఇల్లు పీకి పందిరి వేస్తుంది.ఇంట్లో కనిపించిన వస్తువులన్నింటిని నాశనం చేస్తూ గందరగోళం సృష్టిస్తుంది. అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో ఎలుకలు ఉంటే ఇక ఆ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాగే లక్షలాది సంఖ్యలో ఎలుకలు ఒక జైలులో ప్రవేశించడంతో దెబ్బకు జైలును కాళీ చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజుల నుంచి ఎలుకలలో ప్లేగు ప్రబలిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో ఎలకలు ఎక్కడ పడితే అక్కడ కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని జైలులో ఎలుకలు సంచరించి జైలులో సీలింగ్‌లో ఉన్న వైరింగును మొత్తం కొరికి నాశనం చేశాయి.

ఈ విధంగా సీలింగ్ నాశనమవడం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై జైలును ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు మాట్లాడుతూ.. ఎలుకలు దాడి వల్ల ఫీలింగ్ పానెల్ మొత్తం దెబ్బతిందని, అందుకోసమే జైలును ఖాళీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా సీలింగ్ లోకి కొన్ని ఎలుకల దూరి అవి అక్కడే చనిపోయాయని అధికారులు తెలిపారు.
ఎలుకలు ఎక్కువ సంఖ్యలో సీలింగ్ లో చనిపోవడం వల్ల వాటి శరీర భాగాలు కుళ్లిపోయి అధిక దుర్వాసన వస్తుండడంతో జైలును మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు.

Advertisement

Trending

Exit mobile version