Rohit Sharma: టీమ్ ఇండియన్ కెప్టెన్ ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ వార్తలు రావడంతో అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేశారు. అయితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ తాను రిటైర్మెంట్ చేయబోతున్నాను అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు.

తాను ఏ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించలేదు అంటూ ఈయన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈయన ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారు ఒక మ్యాచ్ ఆడితే తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో కెప్టెన్ రోహిత్ శర్మ A+ గ్రేడ్ ఆటగాడు కావడంతో దీని ప్రకారం ఆయనకు రెమ్యూనరేషన్ అనేది ఒప్పందం కుదుర్చుకొని ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం రోహిత్ శర్మ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల జీతం అందుకుంటారు ఇక మ్యాచ్ల విషయానికి వస్తే…
టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3 లక్షల తీసుకుంటారు. వీటితోపాటు ఐపీఎల్ నుండి 16 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో మ్యాచ్ కు ఒక విధంగా రెమ్యూనరేషన్ అందుకుంటారు. ఇకపోతే ఈయన ఆస్తులు విలువ ఎంత అనే విషయానికి వస్తే రోహిత్ శర్మ నికర విలువ ఆస్తి దాదాపుగా రూ.214 కోట్లు ఉంటుందని సమాచారం.
క్రికెట్ ద్వారా రోహిత్ శర్మ సంవత్సరానికి 23 కోట్ల రూపాయల ఆదాయం పొందుతారు. ఇవి కాకుండా ఈయన పలు కంపెనీలకు బ్రాండ్ ఎండార్స్మెంట్ చేస్తూ మరో రెండు కోట్ల వరకు అదనంగా పొందుతున్నారు. వీటితో పాటు ఈయన అనేక స్టార్టప్లలో దాదాపు రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టాడు.ముంబైలో క్రిక్ కింగ్డమ్ అనే క్రికెట్ అకాడమీని కూడా నడుపుతున్నాడు. వీటితో పటు ముంబైలో 30 కోట్ల విలువ చేసే ఇల్లు,రేంజ్ రోవర్ HSE LWB వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
Latest Videos:



























