మాయాజాలం చిత్రం ద్వారా పరిచయమైన పూనమ్ కౌర్ ఆ తర్వాత ఒక విచిత్రం, గగనం, నాగవల్లి వంటి చిత్రాలలో నటించినా తన కెరీర్ ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ కు దూరమైంది. అయితే
టాలీవుడ్ లో ప్రస్తుతం పూనమ్ కౌరే హాట్ టాపిక్ గా మారింది.

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేస్తున్న సీక్రెట్ కామెంట్స్ అటు టాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు పూనమ్ కౌర్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లని టార్గెట్ చేస్తోందని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పూనమ్ కౌర్ కామెంట్స్ లోని మర్మం బయట పడింది. గత కొంతకాలంగా పూనమ్ కౌర్ సీక్రెట్ గా చేస్తున్న ట్వీట్స్ పవన్ ని ఉద్దేశించినవే అని తేలిపోయింది. ఈ విషయాన్ని పూనమ్ కౌరే అంగీకరించినట్లయింది. అదెలాగంటారా.. అక్కడికే వస్తున్నాం.. ఆమధ్యకాలంలో వైసిపి ఎమ్యెల్యే రోజా పవన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ.. పవన్ కళ్యాణ్ కి టిడిపి వాళ్ళు గుండు కొట్టించింది నిజం.. వాళ్ళు 2014లో కొట్టించారు.. 2019లో కూడా కొట్టిస్తారు అని ఎన్నికలని ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ఖాతాలో రోజా పవన్ పై చేసిన గుండు కామెంట్స్ కు లైక్ కొట్టింది. ఇది ప్రస్తుతం అటు టాలీవుడ్, ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ ని గమనిస్తుంటే.. పవన్ పై ఆమెకు తీవ్రస్థాయిలో ఆగ్రహం ఉన్నట్లు అర్థం అవుతోంది. పవన్ పై అంత పగ ఎందుకో ఆ కారణాన్ని పూనమ్ కౌర్ బయటపెట్టే వరకు ఆ మర్మమేమిటో ఎవరికీ తెలియదు. ఇటీవల పూనమ్ కౌర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించింది. రాక్షసులతో పోరాటం చేసేలా తనని దీవించమని ఎన్టీఆర్ ని వేడుకున్న సంగతి తెలిసిందే. గతంలో జల్సా చిత్రం పేరుతో పూనమ్ కౌర్… పవన్, త్రివిక్రమ్ పై ఇన్ డైరెక్ట్ గా చాలా కామెంట్స్ చేసింది. పవన్ పై తనకు క్రష్ ఉందని చెప్పిన పూనమ్ కౌర్ ఇప్పుడిలా టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మరి.. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక..!




























