టాలీవుడ్ యూత్ స్టార్స్ లో విజయ్ దేవరకొండకి జనాల్లో మాంచి క్రేజ్ ఉంది. తన అభినయంతో అందర్నీ ఆకర్షించిన విజయ్ యూత్ ఐకాన్ గా మారాడు. యూత్ విజయ్ దేవరకొండ స్టైల్ మరియు మేనరిజమ్స్ నీ అనుకరిస్తూ ఉన్నారు. విజయ్ ఎంతో కష్టపడి ఎటువంటి సినిమా బాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు. రౌడీ అనే బ్రాండ్ ని స్థాపించి ఫ్యాన్స్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటూ వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతాడు అందుకే విజయ్ ని అభిమానులు ఇష్టపడుతున్నారు.
“అర్జున్ రెడ్డి” సినిమా తో యువత ను తన వైపుకి తిప్పుకుని, “గీతా గోవిందం” సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన మన రౌడీ స్టార్ ప్రస్తుతం వరస అపజయలతో డీలా పడుతున్నాడు. అర్జున్ రెడ్డి ఘన విజయం సాధించాక “టాక్సీ వాలా” తో సాఫీగా సాగుతున్న విజయ్ సక్సెస్ “నోటా”, “డియర్ కామ్రేడ్” సినిమా లతో బోల్తా పడింది. విజయ్ దేవరకొండ సినిమా అనగానే యూత్ రొమాంటిక్ గా ఉంటుందని అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇటువంటి రొమాంటిక్ హీరో క్రేజ్ వరస ప్లాప్ లతో తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. తాజగా భారీ అంచనాల నడుమ ఈ నెల ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా విడుదలైన అయిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా కూడా మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ పరంగా బాగా తగ్గు ముఖం పట్టింది.
మాములుగా ప్రతి సినిమాకి విడుదలకు ముందు ఆ తర్వాత కూడా ప్రమోషన్స్ చేస్తారు నిర్మాతలు. సినిమా మీద నెగిటివ్ టాక్ వచ్చినా “సక్సెస్ మీట్” అంటూ ప్రమోషన్స్ తో ఇంకా కొంచెం జనాల్లోకి తీసుకెళ్లాలి అని భావిస్తారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కలెక్షన్స్ లేకపోవడంతో మన రౌడీ స్టార్ తన నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వస్తున్న “ఫైటర్” షూటింగ్ లో బిజీగా అయిపోయాడు..
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్ కి రమ్మని అడిగిన నిర్మాతలకు విజయ్ రానని చెప్పాడట. ఎందుకంటే అంత నెగటివ్ టాక్ వచ్చాక కూడా ఇంకా ప్రమోషన్స్ ఎందుకు అనవసరంగా డబ్బులు దండగ అని నిర్మాతలకు చెప్పాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎంత మంచిగా అలోచించాడు మన రౌడీ. అంతే కదండీ ఆల్రెడీ కలెక్షన్స్ పరంగా నష్టపోయిన నిర్మాతకి ఇంకా ఖర్చు పెట్టించడం ఎందుకు అని విజయ్ అభిప్రాయం. అంటే కాదు ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసాడని టాక్. అందుకే ప్రమోషన్స్ కి రాకుండా దుబాయ్ షూటింగ్ లో ఉన్నారు.





























