తాజగా రిలీజ్ అయిన RRR పోస్టర్ ను సైబరాబాద్ పోలీసుల ఉపయోగించిన తీరుచూసి.. వావ్ అంటున్నారు నెటిజన్స్.. అసలు విషయానికి వస్తే తాజాగా RRR సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై వెళ్తున్న పోస్టర్ ఒకటి విడుదల చేసారు. ఇక ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ముందు కూర్చొని బైక్ నడుపుతుంటే.. వెనక కూర్చున్నారు హీరో రామ్ చరణ్ చాలా రోజుల తరువాత వచ్చిన ఈ RRR పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

అయితే.. ఈ సినిమా పోస్టర్ కు ఉన్న ఫాలోయింగ్ గుర్తించిన సైబరాబాద్ పోలీసులు.. బైక్ మీద వెళ్ళేప్పుడు హెల్మెట్ అవసరం గురించి ప్రజలకు అవగాహాన కలిపించే పనిలో భాగంగా ఈ ఫోటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు హెల్మెట్ పెట్టారు. ఈ క్రమంలో బైకుపై వెళ్లే ఇద్దరూ హెల్మెట్ అప్పనిసరిగా పెట్టుకోవాలంటూ సూచించారు. చాలా యాక్సిడెంట్లు వెనక కూర్చుని ఉన్నవాళ్లు హెల్మెట్ లేకపోవడం వల్లే తలకు గాయాలవుతూ కన్నుమూస్తున్నారు. ఈ సందర్భంగా RRR పోస్టర్‌తో హెల్మెట్ పెట్టుకోండి. ప్రాణాలను కాపాడుకోండి అంటూ సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన పిలుపు శెభాష్ అనిపిస్తుంది..
Now it is perfect.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg