RRR Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఇక ఈ సినిమా మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలై ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్తాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇక రిలీజ్‌కి ముందే భారీ రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లలో సునామి సృష్టించింది.

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్క నైజాంలోనే కలెక్షన్స్ పరంగా ఆర్ఆర్ఆర్ ఇదివరకెప్పుడూ లేనివిధంగా రికార్డులను తిరగరాసింది.. నైజాం ఏరియాలోనే మొదటి రోజుకలేక్షన్ల్ పరంగా రూ.23.35 కోట్లు వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 120.19కోట్ల వసూళ్లను కొల్లగోట్టినట్టు సమాచారం. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దీనితో ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 223 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఒక భారతీయ సినిమా అందులోనూ తెలుగు సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది..
#RRR Day 1 biz… Gross BOC…
— taran adarsh (@taran_adarsh) March 26, 2022
⭐ #AP: ₹ 75 cr
⭐ #Nizam: ₹ 27.5 cr
⭐ #Karnataka: ₹ 14.5 cr
⭐ #TamilNadu: ₹ 10 cr
⭐ #Kerala: ₹ 4 cr
⭐ #NorthIndia: ₹ 25 cr#India total: ₹ 156 cr
⭐ #USA: ₹ 42 cr
⭐ Non-US #Overseas: 25 cr
WORLDWIDE TOTAL: ₹ 223 cr pic.twitter.com/B7oAjPXj40
All-time Record Alert!#RRR 's Day 1 Share in Nizam is a new all-time record of ₹ 23.3 Crs..
— Ramesh Bala (@rameshlaus) March 26, 2022
Day 1 Telugu States gross must be more than ₹ 100 Crs..































