గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడు సంవత్సరాల నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నేటితో ఈ ఎదురు చూపులకు పులిస్టాప్ పడిందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో అభిమాన హీరో సినిమా చూడటం కోసం ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లే అభిమాలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి సమయంలో ఒక్కసారి సినిమా మొదలయ్యాక మధ్యలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురై పొరపాటున సినిమా ఆగిపోతే ఇక వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది.

ఇప్పుడు అచ్చం అదే జరిగింది. ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో అన్నపూర్ణ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రదర్శింపబడుతుంది. అయితే అనుకోని విధంగా సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో ఆవేశానికి లోనయిన అభిమానులు ఆ థియేటర్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేసారు. థియేటర్ అద్దాలతో పాటూ, చైర్స్ మరియూ ఇతర సామానులను పగలగొట్టారు.
Fans shatter windows of Annapurna theatre after the management failed to play #RRRMovie due to technical issues in #Vijayawada #Andhrapradesh pic.twitter.com/Z1GvssqZxx
— ur'sGirivsk (@girivsk) March 25, 2022































