RRR Movie: ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ కి ఒక ఆస్కార్ అవార్డు కూడా రాకపోగా ఈ ఏడాది మాత్రం ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో దేశం మొత్తం ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కూడా ఈ అవార్డులపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు, అలాగే ది ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో భాగంగా నాటు నాటు పాటకగాను ఆస్కార్ గెలుచుకున్నటువంటి త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈయన ఈ అవార్డు వేడుకల గురించి మాట్లాడుతూ నాటు నాటు అని ప్రస్తావించగానే ఒక్కసారిగా రాజ్యసభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇలా ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో ఈ విజయాలు
భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

RRR Movie: తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం ..
ఇలా రాజ్యసభలో ఆస్కార్ వేడుకల గురించి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆస్కార్ వంటి గొప్ప అవార్డును తెలుగు చిత్ర పరిశ్రమ అందుకోవడంతో ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని, ముందు ముందు ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డులను మరెన్నో అందుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
Congratulations to V Vijayendra Prasad on the #Oscars win for RRR. An esteemed MP of Rajya Sabha, @VVPrasadWrites has written the screenplay of RRR. Also congratulations to Kartiki Gonsalves & Guneet Monga for exemplifying #NariShakti & winning #Oscars for The Elephant Whisperers pic.twitter.com/QdgyMRHEXk
— Pralhad Joshi (@JoshiPralhad) March 14, 2023





























