“ధైర్యంగా కరోనాను అడ్డుకుందాం”.. ‘RRR’ టీమ్ అద్భుత సందేశం..!!

0
141

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది.. ఈ సెకండ్ వేవ్ లో భాగంగా రోజుకి లక్షల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి..సామాన్య ప్రజలు ఈ మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొందరు సెలబ్రిటీలు సేవా కార్యక్రమాలతో పాటు సందేశ సాయం చేస్తున్నారు.

గత ఏడాది కరోనాను జయించే ప్లాస్మా దానంపై అవగాహనా కల్పించిన ఆర్ఆర్ఆర్ సినిమా టీం ఈసారి కరోనా మీద మరో సందేశాన్ని రూపొందించి విడుదల చేశారు.గత ఏడాది రూపొందించిన సందేశ చిత్రాలలో తారక్, చరణ్ మాత్రమే ఉండగా ఈసారి బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్ గన్ లతో సహా దేశమంతటికీ ఒకేసారి సందేశాన్ని అందించారు.ఒక్కొక్కరూ ఒక్కో భాషలో ప్రస్తుత కష్ట కాలాన్ని విశదీకరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోని కలిసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను అడ్డుకోవాలని, కుదిరిన ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని మన కుటుంబీకులు, స్నేహితులు, దేశాన్ని కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు.ఇందులో హీరోయిన్ అలియా చేత తెలుగులో సందేశాన్ని వినిపించడం విశేషం కాగా.. చరణ్ తమిళం, ఎన్టీఆర్ కన్నడ, రాజమౌళి మలయాళంలో సందేశాన్ని అందించారు. ఇక అజయ్ దేవగన్ హిందీలో తన సందేశాన్ని వినిపించగా ప్రస్తుతం ఈ సందేశాత్మక చిత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరి వారి సూచనలు, సలహాలు తప్పకుండ ప్రతీ ఒక్కరూ పాటించి తిరిగి ఆరోగ్యకరమైన రోజులను మళ్ళీ తెచ్చుకోవాలని కోరుకుందాం..ఇక RRR విషయానికొస్తే ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.. దసరా పండగ సందర్భంగా అక్టోబర్13 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ కరోనా నేపథ్యంలో మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here