RRR : రాజమౌళి తీసిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ ఇక ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. హిందీ బెల్ట్ లో ఏకంగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక సౌత్ లో 700కోట్ల గ్రాస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగింది. ఇపుడు బాలీవుడ్ కి వీళ్లిదరు హాట్ కేక్ లాగా కనిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సీక్వేల్ ఉంటుందా ఉండదా అనే చర్చ బాగానే జరుగుతోంది. అయితే ఇటీవల విజయేంద్ర ప్రసాద్ చేసిన వాఖ్యలు మరొకసారి అభిమానులలో ఆశలను రేకెత్తించాయి. ఆర్ఆర్ఆర్ 2వచ్చే అవకాశం ఉందా అని అడుగగా విజయేంద్ర ప్రసాద్ అవుననే సమాధానం ఇచ్చారు. ఇటీవలే ఎన్టీఆర్ ఇంటికి వచ్చారని ఆర్ఆర్ఆర్ ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఆర్ఆర్ఆర్ 2 వచ్చే అవకాశం గురించి చర్చించుకున్నామని తెలిపారు.కొన్ని ఆలోచనలు వచ్చాయని అవి అందరికి నచ్చాయని దైవం అనుకూలిస్తే ఆర్ఆర్ఆర్ 2 వస్తుందని సదరు ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ అనే కామెంట్స్ పై స్పందిస్తూ కందకి లేని దురద కత్తి పీఠకేందుకు అంటూ ఎన్టీఆర్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తుంటే ఇంకెందుకు ఈ గోల అనే అర్థంలో చెప్పారు.ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో తన కెరీర్ గురించి ఆర్ఆర్ఆర్ ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అంటూ వాఖ్యనించడం తెలిసిందే.































