RRR success party : ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్లు రాబట్టి ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక నైజాం ఏరియాలో దాదాపు 100 కోట్లు వసూళ్లు చేసిన మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది దీంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు వే కావడంతో ఆయన చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇక ఈ సందర్బంగా చిత్రం బృందానికి పార్టీ ఇచ్చారు దిల్ రాజు.

అందరు బిజీ అవ్వక ముందే పార్టీ….
ఇక ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు మూడేళ్లు టీం మొత్తం పనిచేసారు. ఇక ఆర్ఆర్ఆర్ పూర్తయ్యి మంచి విజయాన్ని అందుకోవడం తో వారి తదుపరి ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వబోతున్నారు.రామ్ చరణ్ శంకర్ తో చేయబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు బరువు తగ్గే పనిలో ఉన్నాడు ఆ తర్వాత జూన్ లో కొరటాల శివ సినిమాలో పాల్గొంటాడు. ఇక రాజమౌళి తన కుటుంబం తో కలిసి విదేశాలకు రెండు వరాల పేరు చెక్కేస్తారు.అందుకే ఆ లోపు పార్టీ ఇవ్వాలని దిల్ రాజు భావించారు.

ఇక దిల్ రాజు అఖండ టీంకి కూడా ఇలానే పార్టీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ను క్రాస్ చేసి మరింత ఊపుతో దూసుకుపోతోంది.మొత్తంగా చూస్తే ఈ 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 234.50 కోట్ల నెట్, 351.15 కోట్ల గ్రాస్ వసూలైంది. అలాగే, కర్నాటకలో 37.15 కోట్లు, తమిళనాడులో 33.70 కోట్లు, కేరళలో 9.25 కోట్లు, హిందీలో 91.10 కోట్లు, మిగతా ఇండియాలో 6.90 కోట్లు, ఓవర్సీస్‌లో 84.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 10 రోజుల్లోనే 496.80 కోట్లు షేర్, 900 కోట్లు గ్రాస్ వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.






























