ప్రముఖ సినీ నిర్మాత డీవీవీ దానయ్య గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే గమ్మత్తైన విషయమేమిటంటే ఈ సంఘటన వారం క్రితమే జరుగగా, ఇపుడు వెలుగులోకి వచ్చింది. గడిచిన వారం రోజుల క్రితం డీవీవీ దానయ్యకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా వుంచారు. అయితే, ఇపుడు ఆ విషయం మీడియాలో లీకవడంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు ఫోన్ చేసి దానయ్య ఆరోగ్య పరిస్థితికోసం ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తన సొంత నిర్మాణ సంస్థ డీవీవీ బ్యానర్ పతాకంపై రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ మూవీని తెరక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, రే స్టీవ్‌సన్, అలిసన్ డూడీ, సముద్రఖనిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. So.. టాలీవుడ్ లోనే బడా నిర్మాతైన దానయ్య గారు వీలైనంత త్వరగా కోలుకోవాలని.. మరిన్ని మంచి సినిమాలను నిర్మించాలని కోరుకుందాం.




























