తిరుపతిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. బళ్లారి నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడినవారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో బస్సు అదుపు తప్పిందని తెలుస్తోంది.































