తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ మెుత్తాన్ని జమ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై చర్చించేందుకు 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రూ.50 వేల లోపు రుణాలన్నీంటిని మాఫీ చేయాలని బ్యాంకులకు సూచించింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి బ్యాలెన్స్ చూపించి.. కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కొరింది.
































