S J Surya : తమిళ దర్శకుడు, నటుడు అయిన ఎస్జే సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సూర్య ఆ తరువాత విభిన్న చిత్రాలతో ముందుకెళ్లారు. అయితే ఆయన కథలు చాలా విభిన్నంగా ఉంటూ కమర్షియల్ కంటే కథ బలమున్నవి గా ఉండటంతో హీరోలు చేయడానికి వెనుకాడగా ఆయనే నటుడుగా మారారు. తెలుగులో నాని సినిమా ను తమిళంలో సూర్యనే చేసారు. ఇక సూర్య తెలుగులో ఖుషి సినిమా వల్ల మనకు సుపరిచితులే.

రామ్, కమల్ హాసన్ లా కనిపిస్తున్నాడు…
సూర్య చివరగా మనకు స్పైడర్ సినిమాలో సైకో గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా సూర్య మన తెలుగు హీరో రామ్ పోతినేని ని కమల్ హాసన్ తో పోల్చడంతో రామ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమిళ సినిమా దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో రూపొందిన రామ్ పోతినేని చిత్రం వారియర్ ఈ సినిమా జులై 14న విడుదల కానుంది. అయితే సినిమా తెలుగు, తమిళం లో విడుదల అవుతుండడంతో చెన్నై లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎస్జే సూర్య, మణి రత్నం, బాలాజీ శక్తివేల్, భారతీరాజా, కార్తీక్ సుబ్బరాజు, ఆర్ కే సెల్వమణి, తదితరులు హాజరయ్యారు. ఇక ఈవెంట్లో మాట్లాడుతూ ఎస్జే సూర్య రామ్ పోతినేని ని చూస్తుంటే యంగ్ ఏజ్ లో ఉన్న కమల్ హాసన్ ను చూస్తున్నట్లు ఉందని కంప్లిమెంట్ ఇచ్చారు.

పుష్ప సాంగ్స్ ముంబై వెళ్తున్న కారులో విన్నానని, చాలా నచ్చాయి దేవిశ్రీ మ్యూజిక్ చాలా బాగుందంటూ చెప్పారు. ఇక లింగు స్వామి చాలా కష్టపడ్డాడని ఇక ఈ సినిమాతో మళ్ళీ మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పారు. ప్రస్తుతం సినిమాల విషయంలో మార్పు కనిపిస్తోందని, అటు నార్త్, ఇటు సౌత్ సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారడం హర్షణీయం అంటూ చెప్పారు.



























