Sadha : తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది సదా. మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సదా అంటే ఇప్పటికీ జయం సినిమాలోని వెళ్లవయ్యా వెళ్లు వెళ్ళు.. అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. అంతలా ఆ సినిమాలోని పాత్రతో ఆకట్టుకుంది. తెలుగు లోనే కాకుండా సదా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. తమిళ తెలుగు భాషల్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ తరువాత కెరీర్ అంతగా సాగలేదు. కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఎక్కువకాలం హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి.

ఒక మంచి నటుడిని కోల్పోవడం మన దురదృష్టం…
చాలా కాలంగా సినిమాలకు దూరమైన సదా బుల్లితెర మీద కొన్ని ప్రోగ్రాములకు జడ్జి గా చేసింది. ఇపుడు తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా ఉదయకిరణ్ ఆత్మహత్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ఎందుకు అలా చేసుకున్నాడో తెలీదు కానీ ఒక మంచి నటున్ని కోల్పోవడం మన దురదృష్టం అని చెప్పింది. అయన వరుస సినిమాలు హిట్ అవుతూ మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు ఔనన్నా కాదన్నా సినిమా చేసాను. కెరీర్ అనుకున్నట్టుగానే ఎవరికీ ఉండదు.

ఆయన కెరీర్లో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు… ఇక మనకు కెరీర్ లేదనే అనుకున్నా, మన జీవితం కన్నా అయితే ఏమీ ఎక్కువ కాదు. చాలా మంది సినిమా సరిగా ఆడలేదని డిప్ప్రెషన్ కు లోనవుతుంటారు, అలాంటివి నేను చాలానే విన్నాను. సినిమా హిట్లు ప్లాపులు మన చేతుల్లో ఏమీ వుండవు. మన కృషి మనం చేయాలి ఫలితం ఎలా అయినా రావొచ్చు. నాకు తెలిసి జీవితం అంటేనే పోరాటం అని చెప్పుకొచ్చింది.



























