Sadha : హీరోయిన్ గా జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు భామ సదా వెళ్ళవయ్యా.. వెళ్ళు.. వెళ్లు… అంటూ తెలుగు కుర్రకారుని ఆకట్టుకున్న సదా ఆ తరువాత దొంగ దొంగది, నాగ, ప్రియసఖి, అపరిచితుడు వంటి సినిమాలతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య సినిమాలకు దూరమై ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ లో జడ్జి గా క్రేజ్ తెచ్చుకున్న సదా ఇపుడు ఆ షో లో కూడా లేరు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటున్న సదా తన వ్యక్తిగత జీవితం గురించిన వీడియోలు తన గ్రీన్ లైఫ్ గురించి పరిచయం చేస్తూ అలరిస్తోంది.

మేజర్ సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న సదా…
ఇక సదా ఒక సినిమా చూసి ఫస్ట్ హాఫ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అంతలా తనని ఎమోషనల్ గా కనెక్ట్ చేసిన సినిమా ఏదంటే మేజర్ సినిమా. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయి అందరికీ నచ్చుతోంది, చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. కంటతడితో థియేటర్ నుండి బయటకు వస్తున్నారు. అంతలా అందరకీ కనెక్ట్ అయిన ఈసినిమా ఇపుడు సదా ని కూడా ఏడ్పించేసింది.

భావొద్వేగానికి లోనైన సదా ముంబై దాడుల సమయంలో నేను ముంబై లో ఉన్నానని సినిమాలో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయని, కొన్ని కంటతడి పెట్టించాయని చెప్పింది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం సందీప్ ఉన్నికృష్ణన్ గా అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని చాలా కాలం తరువాత ఇంతగా ఎమోషనల్ అయిన సినిమా మేజర్ సినిమా అని చెప్పింది సదా.































