Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో సంయుక్త మీనన్, సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. అంతే కాకుండా థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా హిట్ అవ్వటంతో సాయిధరమ్ తేజ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక తాజా గా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #AskSDT పేరుతో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ మేరకు ‘ప్రస్తుతం మీకు ఏ నటి అంటే మీకు క్రష్ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. సమంత అని సమధానం చెప్పాడు . అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న హీరోలలో మీ అభిమాన హీరో ఎవరు? ప్రశ్నించగా.. మాస్ మహారాజ రవితేజ, ప్రభాస్ అని సమధానం చెప్పాడు.
మెగా కాంపౌండ్ లో అంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టం అని సాయిధరమ్ తేజ్ చెప్పటంతో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రభాస్, రవితేజ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని సాయిధరమ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తాజాగా విరూపాక్ష పార్ట్-2 కూడా ఉండబోతుందని ప్రకటించాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…