Sai Pallavi : విరాట పర్వం సినిమా శుక్రవారం నాడు విడుదలయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన సినిమా తోలుత ఓటీటీ లో విడుదల చేయాలనుకున్నా చివరికి థియేటర్ లో సందడి చేస్తోంది. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఒక డాక్యుమెంటరీలా కథను ఉన్నది ఉన్నట్టుగా సినిమా తీసి ఒక అమ్మాయి ప్రేమ కథను నక్సల్ పోరాటాన్ని చక్కగా చూపాడు దర్శకుడు.

వచ్చిండే… పాటకు డాన్స్ చేసిన సాయి పల్లవి…
ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతోంది. పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా, సాయి పల్లవి సినిమా గురించిన విశేషాలను తెలుపుతూ ప్రేక్షకులకు సినిమాని దగ్గర చేస్తున్నారు. ఇక ఇపుడు సాయి పల్లవి చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి సినిమా ప్రచారాల్లో భాగంగా విజ్ఞాన్ కాలేజీని రానాతో పాటు సందర్శించారు. అక్కడ ఫిదా లోని వచ్చిండే.. మెల్ల.. మెల్లగ వచ్చిండే… పాటకు డాన్స్ చేసి అలరించింది సాయి పల్లవి.

The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag ????????????
— Shreyas Media (@shreyasgroup) June 16, 2022
Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3
ఇక విద్యార్థుల ఈలలు, కేరింతలతో తెగ ఎంజాయ్ చేసారు. దర్శకుడు వేణు ఉడుగుల, హీరో రానా కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇక సాయి పల్లవి విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో మతం గురించి వివాదాస్పద వాఖ్యలు చేయడంతో భజరంగ్ దళ్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసి పోలీస్ కేసు పెట్టడం క్షమాపణలు చెప్పేవరకు వదిలేది లేదంటూ కామెంట్స్ చేయడం తెలిసిందే. ఇక ఈ విషయంలో పై సాయి పల్లవి పై విజయశాంతి కూడా ఘాటుగా స్పందించారు.































