Sai Pallavi : తెలుగమ్మాయి కాకపోయినా తెలుగుమ్మాయే అనేంతలా మరీ ముఖ్యంగా తెలంగాణ గడుసు పిల్లలా అందరి మనసులు దోచుకున్న సాయి పల్లవి అంటే నచ్చని వారు ఉంటారా. గ్లామర్ ఒలకబోస్తూ పొట్టి బట్టలు వేసుకుని కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నా అందుకు పూర్తి భిన్నంగా సాయి పల్లవి మాత్రం కట్టు బొట్టులో నేను మారను, ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయను అంటూ అందరికీ షాకిస్తోంది. తన పాత్రకు ప్రధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటూ నటనకు మార్కులు కొట్టేస్తూ మేక్అప్ కూడా పొదుపుగా వాడుతానంటున్న ఈ అమ్మడు ఇపుడు మరోసారి వైరల్ అయింది.

సాయి పల్లవి మీద మోజు పడిన పొలిటిషియన్ కొడుకు…
ఇంతలా వాల్యూస్, రూల్స్ ఉన్న సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఇప్పట్లో సాయి పల్లవి తప్ప ఇంకొకరు లేరు. ఇక అలాంటి సాయి పాల్లవి అంటే ఇండస్ట్రీ లో మంచి అభిమానం, గౌరవం ఉన్నాయి. అలాంటపుడు సాధారణ జనమే కాదు సెలబ్రిటీలు కూడా పల్లవిని ఇష్టపడుతున్నారు. ఈ అమ్మడి అందానికి, వ్యక్తిత్వానికి ఫిదా అయినా ఒక పొలిటిషియన్ కొడుకు ఏకంగా తండ్రితో పెళ్లి సంబందం మాట్లాడటానికి సాయి పల్లవి వాళ్ళ ఇంటికే పంపించారట.

ఈ న్యూస్ ఇపుడు ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ అయింది. సాయి పల్లవి ఇంటికి వెళ్లి సాయి పల్లవి నాన్నగారిని సంబంధం అడిగాడట పెద్ద మనిషి. అయితే సాయి పల్లవి పెళ్ళికి నో చెప్పేసిందట. అయితే ఆయనకు బాగా మర్యాద చేసి ఎంతో గౌరవంగా ఈ ప్రపోజల్ ను తిరస్కరించిందట. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని కెరీర్ పైనే దృష్టి పెట్టానని చెప్పిందట.



























