మాది తమిళనాడులోని బాడుగ తెగ..మా భాషకు లిపి లేదు… సాయి పల్లవి

0
381

మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది..

ఒక్కసారిగా కుర్రకారు గుండెలని కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన MCA చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది.. ఇంకా రానా విరాట పర్వంలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.. ఇవే కాకుండా మరో రెండు మూడు తెలుగు సినిమాలు కూడా ఆమె సైన్ చేసింది..ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ సాయిపల్లవి తన ఫ్యామిలీ.. తన పర్సనల్ విషయాలను పంచుకుంది. ఒక వేళా నటి కాకుంటే ఏం చేసుండే వారని అడగగా.. సాయి పల్లవి స్పందిస్తూ.. ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని తెలిపింది.

ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా… మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదని సమాదానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా..ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది. ఇదిలా ఉంటే ఇక ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదారియా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారం రోజుల్లో రెండు కోట్ల మంది ఈ పాటను వీక్షించారంటే ఆమె కి ఎంత పోపులతిరి ఉందొ అర్థం చేసుకోవచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here