Sai Pallavi:తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని హీరోలకు దీటుగా నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవి డాన్స్ షో ల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు.సాయి పల్లవి పక్కన డాన్స్ చేయాలంటే హీరోలు కూడా కాస్త తడబడతారు అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా ఎన్నో డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈమె చివరి వరకు వెళ్లి రన్నర్ గా రావడంతో ఈమె ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా’ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ సమయంలో ఫైనల్ వరకూ వెళ్లి రన్నర్ గా తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి డాన్స్ షోలలో టాలెంట్ ఉన్నవారికి గుర్తింపు ఉండదని కేవలం వారసులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Sai Pallavi: అలాంటి షోలు అంటే అసహ్యం…
ఇలాంటి రియాలిటీ షో లలో ఎంతో కష్టపడి పాల్గొన్నప్పటికీ వారి కష్టానికి ఫలితం ఉండదు కేవలం వారసులకు మాత్రమే గౌరవం ఇచ్చి వారికి పట్టం కడతారు.అందుకే తనకు ఇలాంటి రియాలిటీ షోల్ అంటే చాలా అసహ్యం అంటూ ఈ సందర్భంగా ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాయి పల్లవి డాన్స్ షో ల గురించి వారసత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























