Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె కాశ్మీర్ పండిట్ల గురించి, గో సంరక్షకులు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సాయి పల్లవి చేసిన మాటలలో ఏ విధమైనటువంటి తప్పులేదు.

మనం మంచిగా ఉండాలి కానీ మతాలలో కాదు. మనలో మంచితనం లేకుంటే మతంలో ఎక్కడ వస్తుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి తప్పులేదు కానీ కొందరు ఈమె స్టార్ డమ్ అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అలాగే సాయి పల్లవి వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే సాయి పల్లవి ఈ ఫిర్యాదులను రద్దు చేసి ఏకంగా హైకోర్టు ఆశ్రయించారు. అయితే హైకోర్టులో సాయి పల్లవికి చేదు అనుభవం ఎదురయింది. హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను తోసి పుచ్చింది.అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సినిమా విడుదలైన తర్వాత స్పందిస్తానని చెప్పిన సాయి పల్లవి జూన్ 21వ తేదీ హైకోర్టును ఆశ్రయించింది.
క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన భజరంగ్ దళ్ నాయకులు…
తెలంగాణ హైకోర్టు సాయి పల్లవి అభ్యర్థనను స్వీకరించకపోవడంతో ఈమెకు నిరాశ ఎదురైనట్టయింది. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ నాయకులు సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను వెనుక తీసుకుని క్షమాపణలు చెబితే తాము కూడా కేసు వెనక్కి తీసుకుంటామంటూ వెల్లడించారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.




























