Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా మొదటి సినిమా అద్భుతమైన విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో కూడా తాను ఎంతో అసంతృప్తిగా సినిమాల్లో నటించానని అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.

ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోతే తన చేతిలో ఎలాగో డాక్టరేట్ ఉందని తాను వైద్య వృత్తిలో స్థిరపడతానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు డబ్బుకు లోటు లేకుండా పెంచారని అయితే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు చేయాలో కూడా నేర్పించారని తెలిపారు.
ఇప్పటికీ తల్లిచాటు బిడ్డనే..
ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది మనకు ఎంతవరకు అవసరం అవుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే చిన్నప్పటినుంచి తాను ఏ వస్తువు కొన్నా తల్లి చేతుల మీదుగా కొనడం తనకు అలవాటు అని ఇప్పటికీ తను ఏం కొన్నా కూడా తన తల్లికి ఓటీపీ ద్వారా తెలిసిపోతుందని సాయి పల్లవి తెలియజేశారు. ఈ విధంగా తను అగ్రనటిగా కొనసాగుతున్నప్పటికీ తల్లిచాటు బిడ్డ నేనంటూ సాయి పల్లవి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























