ఎదిగిన కూతురు ముందు ఏ తండ్రైనా పడకగది ముచ్చట్ల గురించి మాట్లాడతాడా..? కూతురు పక్కనే ఉందని తెలిసీ కూడా ఎంత టి.వి. షో అయినా సరే ఎవరైనా ఇలా రొమాన్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారా..? అడగరుగాక అడగరని మీరనుకుంటే మీరు ఖచ్ఛితంగా పప్పులో కాలేసినట్టే.! ఎందుకంటే.. ఇప్పుడు అదే జరిగింది. మీరిప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.. తన కూతురు సారా అలీ ఖాన్ ఎదురుగా “కాఫీ విత్ కరణ్ షో” లో మాట్లాడిన రొమాంటిక్ టాపిక్స్ కోసం చదవబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షో అయిన “టాక్ వీత్ కరణ్ జోహార్” షోకి గెస్ట్ గా వచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, ఆయన కూతురు సారా అలీఖాన్. గతంలో సైఫ్ అలీఖాన్‌కు 2 పెళ్లిళ్లైన విషయం అందరికీ తెలిసిందే. మొదటి భార్య కూతురే సారా అలీఖాన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు సైఫ్. వీరిద్దరికీ తైమూర్ పుట్టాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ షోలో తన మొదటి భార్య గురించి అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సర్ చెప్పాడు సైఫ్. కరీనా కపూర్ పెళ్లైన తర్వాత కూడా తన ఫిజిక్ ని చక్కగా మెయిన్ టైన్ చేస్తూ జిమ్ విషయంలో గోల్స్ సెట్ చేస్తోంది. ఆమధ్య కాలంలో కరీనాకు కొడుకు పుట్టాక కాస్త లావైందనే కామెంట్స్ ఆమె చెవిన పడ్డాయి. దాంతో అతి కొద్దికాలంలోనే కరీనా తన బరువును తగ్గించుకుని స్లిమ్ గా మారిపోయింది. జిమ్ లోనే ఎక్కువ సమయం గడిపే కరీనాను బాలీవుడ్ స్టార్స్ అందరూ “జిమ్ హాలిక్” అని ఆట పట్టిస్తుంటారు.

తాజాగా ఈ షోలో “మీ భార్య జిమ్ లుక్ గురించి మీరేం చెబుతారు.?” అని సైఫ్ ను అడగ్గానే… అందుకు సైఫ్ బదులిస్తూ.. “ఆమె జిమ్ లుక్ ను అందరూ ఒకలా చూస్తే.. నేను మాత్రం బెడ్ రూమ్ లో క్లోజప్ లుక్ లో చూస్తాను” అని బోల్డ్ గా చెప్పడంతో ఒక్కసారిగా ఆ షో వైరల్ గా మారింది. ఈ షో ను చూసిన ప్రేక్షకులు ఇలాంటి హాట్ కామెంట్స్ ఎదిగిన కూతురిని పక్కన పెట్టుకుని సైఫ్ మాట్లాడటం చాలా దారుణం అని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో సైఫ్ అలీఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కూతురు ముందు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదా..? అంటూ సైఫ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కామెంట్స్ కి సైఫ్ ఎలాంటి వివరణ ఇస్తాడో.. అసలు స్పందిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.!



























